Photo Feature: షాపింగ్‌, పరేషాన్‌ | Local to Global Photo Feature in Telugu: Lockdown, Hyderabad, Charminar | Sakshi
Sakshi News home page

Photo Feature: షాపింగ్‌, పరేషాన్‌

May 13 2021 4:29 PM | Updated on May 13 2021 5:12 PM

Local to Global Photo Feature in Telugu: Lockdown, Hyderabad, Charminar - Sakshi

లాక్‌డౌన్‌ సడలింపు సమయమైన ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు హైదరాబాద్‌ నగర​ రోడ్లన్నీ జనంతో నిండిపోతున్నాయి. కొనుగోళ్లతో పాటు ఇతర అవసరాల కోసం నగర ప్రజలు ఒక్కసారిగా బయటకు వస్తున్నారు. రంజాన్‌ పండుగ నేపథ్యంలో చార్మినార్‌ వద్ద ముస్లింలు పెద్ద ఎత్తున షాపింగ్‌ చేయడం కనిపించింది. 

1
1/7

లాక్‌డౌన్‌కు ముందు: బుధవారం జనంతో కిటకిటలాడుతున్న హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌ కూరగాయల మార్కెట్‌

2
2/7

జలసిరులు మోసుకెళ్తున్న మొయిళ్లు పైన.. ప్రజలను తీసుకెళ్తున్న రైలు కిందన. ఆ మబ్బుల నుంచి కూత పెట్టుకుంటూ రైలు నేల మీదకు వచ్చిందా అన్నట్టు కనిపిస్తున్న ఈ దృశ్యం శ్రీకాకుళం జిల్లా కంచిలి మండల కేంద్రంలో ఆవిష్కృతమైంది. అపురూపంగా కనిపించిన ఈ దృశ్యాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. – కొత్తకోట నవీన్‌కుమార్, కంచిలి

3
3/7

సేమ్యా పాయసమంటే చిన్నా–పెద్దా ఎవరైనా లొట్టలేసుకుంటూ ఆరగిస్తారు. రంజాన్‌ పర్వదిన వేళ ముస్లిం కుటుంబాల్లో సేమ్యాపాయసం లేకుండా పండుగ జరగదు. విజయవాడ వన్‌టౌన్‌ ప్రాంతంలో ఈ సేమ్యాలను తయారు చేసి విక్రయిస్తున్న దృశ్యాలివి. –సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ

4
4/7

కోవిడ్‌ సంక్షోభంలోనూ అవిశ్రాంతంగా కష్టపడుతున్నా తమకు సరైన గుర్తింపు రావడంలేదంటూ.. వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్న నర్సులు వీరంతా. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా బుధవారం బెల్జియంలోని లీగే సిటీలోని ఓ ఆస్పత్రిలో తీసిందీ ఫొటో

5
5/7

అహ్మదాబాద్‌లోని ఓ విశాల క్రీడా మైదానంలో ‘కారులో కోవిడ్‌ టీకా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దృశ్యం

6
6/7

అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజస్తాన్‌లోని బికనీర్‌లో ఒకరికొకరు సంఘీభావం తెలుపుకుంటున్న నర్సులు

7
7/7

ఢిల్లీలో భారీ రాజకీయ బహిరంగ సభలకు వేదికైన రామ్‌లీలా మైదానంలో 500 ఐసీయూ పడకల కోవిడ్‌ తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటుచేసిన దృశ్యం. అదే ప్రాంతంలో ఉన్న చెట్టును కొట్టేయకుండా అలాగే వదిలేయడం ఫొటోలో చూడొచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement