ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్‌ స్కీమ్‌ అమలు చేయండి: కేటీఆర్‌ రిక్వెస్ట్‌ | Ktr Tweet On Breakfast Scheme In Government Schools | Sakshi
Sakshi News home page

ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్‌ స్కీమ్‌ అమలు చేయండి: కేటీఆర్‌ రిక్వెస్ట్‌

Jul 16 2024 9:15 AM | Updated on Jul 16 2024 10:02 AM

Ktr Tweet On Breakfast Scheme In Government Schools

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ స్కూళ్లలో తాము ప్రవేశపెట్టిన బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేయడం దురదృష్టకరమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

తమిళనాడు ప్రభుత్వం బ్రేక్‌ఫాస్ట్‌ స్కీమ్‌ను విస్తరించిన సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్‌ పిల్లలతో బ్రేక్‌ఫాస్ట్‌ తింటున్న వీడియోను కేటీఆర్‌ మంగళవారం(జులై 16)  ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేసి కామెంట్‌ చేశారు.

‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లలకు ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్‌ లాంటి అద్భుతమైన స్కీమ్‌ను రద్దు చేయడం నిజంగా దురదృష్టకరం. కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థుల కోసం అల్పాహార పథకాన్ని ప్రారంభించింది. 

స్కీమ్‌ను విస్తరించాలని కూడా భావించింది. ప్రస్తుత ప్రభుత్వం తమ అనాలోచిత నిర్ణయాన్ని పునఃపరిశీలించి అల్పాహార పథకాన్ని తిరిగి అమలు చేయాలి’అని కేటీఆర్‌ కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement