వాల్స్.. వండర్స్.. ప్రతి గోడా ఓ కళాఖండంలా.. | Kims Sunshine Hospital is an innovative endeavor | Sakshi
Sakshi News home page

వాల్స్.. వండర్స్.. ప్రతి గోడా ఓ కళాఖండంలా..

Jul 22 2024 8:22 AM | Updated on Jul 22 2024 8:22 AM

Kims Sunshine Hospital is an innovative endeavor

మ్యూజియాన్ని తలపించే ఆస్పత్రి గోడలు
ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు డాక్టర్ల కృషి
పేషెంట్లకు కంఫర్ట్‌ ఇవ్వగలిగేలా వాతావరణం
కిమ్స్‌ సన్‌షైన్‌ హాస్పిటల్‌ వినూత్న ప్రయత్నం 

ఖైరతాబాద్‌: ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం.. అయితే మనలో చాలా మంది అనారోగ్యంపాలైనప్పడు ఆస్పత్రులకు వెళ్లక తప్పదు..వెళ్లాలి కదా..! ఇప్పుడేమంటారు? అంటారా.. అదేనండి.. ఆస్పత్రులు అనగానే చాలా మంది బెదిరిపోతారు.. ఎందుకంటే ఓ వైపు మందుల వాసన, మరోవైపు ఫినాయిల్‌కంపు, ఎక్కడ చూసినా గోడలకు రోగాలకు సంబంధించిన పోస్టర్లు, చూట్టూ రోగులు.. అబ్బో నా వల్ల కాదు బాబోయ్‌ అంటారు. అలాంటి వారు కూడా ఈ ఆస్పత్రికి వెళ్లాలంటే మాత్రం ఎంచక్కా మ్యూజియంకో, ఎగ్జిబిషన్‌కో వెళ్తున్నట్లు రెడీ అయిపోతారు.. అదే నగరంలోని కిమ్స్‌ సన్‌షైన్‌ హాస్పటల్‌. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..  



క్యారికేచర్స్‌గా డాక్టర్స్‌ ఫొటోలు.. 
ఆయా డిపార్ట్‌మెంట్ల ముందు డాక్టర్ల ఫొటోలను పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోల్లాగా కాకుండా లైటర్‌వేయిన్‌తో క్యారికేచర్స్‌గా ప్రత్యేకంగా రూపొందించి ఏర్పాటుచేశారు. ఈ ఫొటోలను చూసి హాస్పిటల్‌కు వచ్చిన వారు ఎంజాయ్‌ చేయడంతో పాటు ఉత్సాహంగా ఫోన్లో ఫొటోలు భద్రపరుచుకుంటున్నారు. 

ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో సతమతమౌతున్న మనిషికి ఆధునిక వైద్య విధానాలు ఎన్ని వచి్చనప్పటికీ ఆప్యాయంగా... ప్రేమగా పలకరించే వైద్యులు, వారి బాధలు చెప్పుకునేంత సమయం.. ఓర్పు, సహనం కలిగిన వైద్యులతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపించే హాస్పిటల్‌కు వెళ్లామనే ïఫీలింగ్‌ పేషెంట్లకు కలిగించేందుకు కొత్త కొత్త ఏర్పాట్లు చేస్తున్నాయి పలు హాస్పటల్స్‌. ఈ తరహా ప్రయత్నమే చేస్తోంది నగరంలోని బేగంపేట కిమ్స్‌ సన్‌షైన్‌ హాస్పటల్‌. రొటీన్‌ వాతావరణానికి భిన్నమైన అనుభూతిని కలి్పంచేలా ఓ మ్యూజియంకు వెళ్లామనే అనుభూతి, పేషెంట్‌ను పేషెంట్‌గా కాకుండా ఒక గెస్ట్‌గా ఆహా్వనించే పద్దతి, ఎక్కడ ఏ సమస్య వచి్చనా వెంటనే హాజరై సలహాలు, సూచనలు చేసే సిబ్బంది    ఉంటే ఆ రోగికి సగం జబ్బు నయమైపోయినట్లే అంటున్నారు విశ్లేషకులు.  

సంస్కృతిని ప్రతిబింబించేలా..
హాస్పిటల్‌లోకి వెళ్లగానే బాబోయ్‌ హాస్పిటల్‌కు వచ్చామనే ఫీలింగ్‌ లేకుండా ఉండేవిధంగా లోపలికి అడుగు పెట్టగానే తెలుగు సాంప్రదాయ పద్దతిలో చేతులు జోడించి నమస్కారంతో స్వాగతం పలికే సిబ్బంది మొదలుకొని డాక్టర్ల వరకూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. హాస్పిటల్‌లో డాక్టర్‌ ఓపి పరిసరాల్లో ఉండే గోడలపై భారతీయతను ప్రతిబింబించేలా తెలుగు పండగలు, అలనాటి క్రీడలు, అన్ని మతాలనూ ప్రబోధిస్తూ ఫొటోలు, తెలుగు రాష్ట్రాల చీరలు, రామాయణం, మహాభారతం, మనదేశ సంప్రదాయ నృత్యాలు, తల్లిప్రేమను ప్రతిబింబించే ఫొటోలు, మెడిసిన్‌ హిస్టరీని తెలియజేసే ఫొటో ఎగ్జిబిషన్, ఆయా డిపార్ట్‌మెంట్ల ప్రాముఖ్యతను తెలిపే ఫొటోలు, మన శరీరం ఆకృతిని నిర్దేశిస్తూ శరీరంలో ఉండే అస్థిపంజరం నమూనాలు, పెయింటింగ్స్‌ పరిజ్ఞానాన్ని పెంచడంతో పాటు మనస్సుకు ఎంతో ప్రశాంతతను చేకూరుస్తాయని చెప్పవచ్చు. ఇక్కడికి వచ్చే వారు ప్రతి ఫ్లోర్‌లో మనస్సు నింపుకొని వెళ్లే విధంగా ఉండటం కిమ్స్‌ సన్‌షైన్‌ హాస్పిటల్‌ ప్రత్యేకత.

సిబ్బంది పద్దతి నచ్చింది..
మేము ఉండేది కొండాపూర్, మా చుట్టుపక్కల ఎన్నో హాస్పిటల్స్‌ ఉన్నాయి. అయినా గంటన్నర ప్రయాణం చేసి బేగంపేటలోని కిమ్స్‌ సన్‌షైన్‌ హాస్పిటల్‌కు వస్తాం. ఇక్కడి వాతావరణం, నర్సులు, ఇతర సిబ్బంది పద్దతి మాకు బాగా నచ్చింది. బాధ్యతతో వ్యవహరించే డాక్టర్లు, హాస్పిటల్‌లో ప్రతి ఫ్లోర్‌లో ప్రశాంతతను ఇచ్చే వాతావరణం మాలో బరోసాను పెంపొందిస్తుంది.  
– జే.సుమిత్ర, కొండాపూర్, గృహిణి

సేవా ధృక్పథంతో...
మేమంతా సేవా ధృక్పథంతో పనిచేస్తున్నాం. మా అందరి గురువు డాక్టర్‌ గురవారెడ్డి. ఆయన అడుగు జాడల్లో రోగులను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి బాధలు చెప్పుకునేంత సమయం ఇస్తూ, వారి ఆనందంలో భాగస్వాములవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడి సిబ్బంది ఒక కుటుంబంలా పనిచేయడం ఎంతో సంతోషం. 
– డాక్టర్‌ నివేదిత సాయిచంద్ర, న్యూరో ఫిజీషియన్‌

కంఫర్ట్‌ ఇవ్వగలగాలి..
రొటీన్‌ పద్దతికి స్వస్తిచెప్పి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపించేలా మ్యూజియం, హార్ట్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశాం.. రానున్న సంవత్సరంలో పేషెంట్‌ను గెస్ట్‌లా భావిస్తున్నాం.  ఆస్పత్రిలో మంచి వాతావరణం ఉండటం వల్ల సగం జబ్బు నయమవుతుంది. గోడలను రకరకాల పెయింటింగ్స్, డిజైన్స్, ఫొటోలతో ఏర్పాటు చేశాం. అన్ని బాధలూ మేము తగ్గించకపోవచ్చు, కానీ అందరికీ ఆత్మస్థైర్యాన్ని, కంఫర్ట్‌ని ఇవ్వగలగాలి. ఇంగ్లిష్‌లో ఓక సామెత ఉంది ‘యు మే నాట్‌ క్యూర్‌ ఆల్‌ ది టైం.. బట్‌ యు కెన్‌ కంఫర్ట్‌ ఆల్‌ ది టైం’ అనేది నేను బలంగా నమ్ముతాను.  
– డాక్టర్‌ ఏవీ గురవారెడ్డి, కిమ్స్‌ సన్‌షైన్‌ హాస్పిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement