గుడివాడ: కృష్ఝాజిల్లాలోని గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ భవనం పైనుంచి దూకిన వ్యక్తి మృతిచెందాడు. నందివాడ మండలం పాత రామాపురంకు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి.. గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ భవనం పైనుంచి దూకాడు. ప్రవీణ్ మానసికి పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించేందుకు తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు.
ఆస్పత్రికి తీసుకొచ్చిన కాసేపటికి భవనంపైకి వెళ్లి దూకేశాడు. దాంతో తీవ్రగాయాల పాలైన అతనికి చికిత్స చేసినా ప్రయోజనం కనిపించలేదు. కాసేపు మృత్యువుతో పోరాడిని చివరకు తుదిశ్వాస విడిచాడు. చికిత్స కోసం తీసుకొస్తే ఇలా జరగడంపై కుటుంబ సభ్యుల కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్నారు.


