అమెరికాలో ఖమ్మం యువకుడిపై హత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి

Khammam Student Varun Stabbed At US Gym Dies - Sakshi

సాక్షి, ఖమ్మం: అమెరికాలో దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం యువకుడు వరుణ్‌ తేజ(24) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. ఈ మేరకు కుటుంబసభ్యులకు సమాచారం అధికారులు సమాచారం అందించారు.. వరుణ్‌  మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

కాగా ఖమ్మం జిల్లా మామిళ్లగూడెంకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పుచ్చా రామ్మూర్తి కుమారుడు వరుణ్‌ తేజ్‌ 2022 ఆగస్టులో కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేసేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ ఇండియానా రాష్ట్రంలోని ఓ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ చదువుతూ పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్‌ 31న వాల్‌పరైసో నగరంలో జిమ్‌ నుంచి బయటకు వస్తున్న వరుణ్‌పై అకస్మాత్తుగా ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు.

తీవ్రగాయాలపాలైన వరుణ్‌ రక్తపు మడుగులో పడిపోగా స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటి నుంచి వరుణ్‌ పరిస్థితి విషమంగానే ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచాడు. నిందితుడు ఆండ్రేడ్‌ జోర్డాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
చదవండి: తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top