రైతు దగ్గర రూ.82 వేలు కొట్టేసిన ఏటీఎం దొంగ!

Khammam Police Arrest ATM Robbers - Sakshi

ఖమ్మం: అవసర నిమిత్తం నగదు డ్రా చేసుకునేందుకు ఏటీఎం సెంటర్ కు వచ్చిన రైతు దగ్గర నుంచి మోసం 82 వేల రూపాయిలు డ్రా చేసుకున్నా కేటుగాడుని ఖమ్మం త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. రైతుకు డబ్బులు డ్రా చేయడం తెలవక పోవడంతో వెనుక ఉన్న వ్యక్తి నేను తిసిస్తాను అని చెప్పడంతో నమ్మి తన ఏటీఎం కార్డు ఇచ్చినట్లు రైతు పేర్కొన్నారు. ఎంతో తెలివిగా ఏటీఎం కార్డు మార్చి 82వేల రూపాయలను కేటుగాడు డ్రా చేసుకున్నాడు. అయితే, బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఏటీఎం సెంటర్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకొని దొంగను పట్టుకున్నారు. 

పూర్తీ వివరాల్లోకి వెళ్లితే.. మహబూబాబాద్ జిల్లా పెరుమాళ్ళ సంకీస గ్రామానికి చెందిన బోబ్బ వెంకటరెడ్డి అనే రైతు పురుగు మందులు కొనుగోలు చేసేందుకు ఇటీవల ఖమ్మంకు వచ్చాడు. తన అవసరాల కోసం నగదు డ్రా చేసుకునేందుకు నగరంలోని గాంధీచౌక్ ఎస్బీఐ ఏటీఎం సెంటర్ వచ్చాడు. అక్కడ ఉన్న ఏటీఎంలో డబ్బు డ్రా చేస్తున్న క్రమంలో డబ్బులు రాక పోవడంతో వెనుకనే ఉన్న గుర్తు తెలియని వ్యక్తి నేను ట్రై చేస్తానని చెప్పి డబ్బులు రావడం లేదని చెప్పి తన కార్డ్ కు బదులు వేరే ఏటీఎం కార్డ్ ఇచ్చి మోసం చేసి తన ఖాతా నుండి 82 వేల రూపాయిలు డ్రా చేసుకున్నట్లు బాధితుడు ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఏటీఎం సెంటర్ సిసి ఫుటేజ్, మోసం చేసి రైతుకు ఇచ్చిన ఏటీఎం కార్డ్ చిరునామా ప్రకారం పోలీసలు విచారణ చేపట్టారు. సిసి ఫుటేజ్ విజువల్స్ అనుమానం గల వ్యక్తి(కొండబోయిన నరసింహారావు) ఆదివారం అనుమానాస్పదంగా గాంధీచౌక్ పరిసరాలలో తిరుగుతుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడు చేసిన నేరం ఒప్ప్పుకున్నాడు.  

ఈ నేరంతో పాటు ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మూడు నేరాలు, ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, ఇల్లందులో రెండు నేరాలు చేసినట్లు నిందితుడు అంగీకరించారు. అతనిని అరెస్టు చేసే సమయంలో అతని వద్ద ఉన్న 36,000/- రూపాయల నగదు, పల్సర్ మోటార్ సైకిల్ స్వాధీన పర్చుకోని రిమాండ్ కు పంపారు. ఏటీఎం సెంటర్లో డబ్బులు డ్రా చేసుకునే సమయంలో ఖాతాదారులు జాగ్రత్త లు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. డబ్బులు డ్రా చేయడం తెలియకపోతే ఇంట్లొ సంబంధించిన వ్యక్తులను వెంట తీసుకొని ఏటీఎం సెంటర్ కి వెళ్లాలే తప్పితే గుర్తుతెలియని వ్యక్తుల సహకారం తీసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

చదవండి:

మార్చి నెలలో 11 రోజులు బ్యాంకులకు సెలవు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top