ఎమ్మార్వో నాగరాజు ఆత్మహత్య.. అనుమానాలు | Keesara MRO Naga raju Family Suspects It is Murder | Sakshi
Sakshi News home page

నాగరాజు కేసులో పలు అనుమానాలు

Oct 20 2020 3:33 PM | Updated on Oct 20 2020 3:45 PM

Keesara MRO Naga raju Family Suspects It is Murder  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కీసర ఎమ్మార్వో నాగరాజు మృతి కేసులో అనుమానాలు ఉన్నాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నాగరాజుది ఆత్మహత్య కాదు, ముమ్మాటికీ హత్యేనని వారు ఆరోపిస్తున్నారు. జైల్లో ఆత్మహత్య ఎలా సాధ్యమని వారు ప్రశ్నిస్తున్నారు. ఆత్మహత్య చేసుకుంటుంటే జైలు సిబ్బంది ఏం చేశారు? జైలు సిబ్బందిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు అని సందేశాలు వ్యక్తం చేశారు. ఏసీబీ కేసుల్లో వాస్తవం లేదని తమ వద్ద ఆధారాలున్నాయని తెలిపారు. ఇప్పటికే సీసీ ఫుటేజీ ఏసీబీ కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. ఈ విషయంలో సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేస్తామని నాగరాజు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికే నాగరాజు కుటుంబ సభ్యులు హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేశారు. 

చదవండి: నాగరాజుది హత్యే..

Advertisement
 
Advertisement
Advertisement