కామారెడ్డిలో ఉద్రిక్తత.. హైకోర్టును ఆశ్రయించిన రైతులు

Kamareddy Farmers Filed Petition In High Court Against Master Plan - Sakshi

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో మాస్టర్‌ ప్లాన్‌ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారింది. జిల్లాలో మూడు రోజు కూడా రైతుల ఆందోళన కొనసాగుతోంది. కాగా, మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా కామారెడ్డి రైతులు తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 

హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్‌లో తమను సంప్రదించకుండా రీక్రియేషన్‌ జోన్‌గా ప్రకటించారని పేర్కొన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ తమకు నష్టం చేసే విధంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, రైతుల పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇక, అంతకముందు మాస్టర్‌ ప్లాన్‌ రద్దు చేయాలంటూ శుక్రవారం రైతులు బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 

మరోవైపు.. శనివారం కూడా కలెక్టరేట్‌ వద్ద రైతుల నిరసన కొనసాగుతోంది. మాస్టర్‌ ప్లాన్‌ మార్చాల్సిందేనంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌ తీరుపై రైతులు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు కలెక్టర్‌ తమను కలవలేదని మండిపడుతున్నారు. కాగా, రైతుల నిరసనల నేపథ్యంలో కలెక్టరేట్‌, మున్సిపల్‌ ఆఫీసు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇక, విపక్ష నేతల పర్యటనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. అంతకుముందు.. కలెక్టరేట్‌ వద్ద పోలీసు వాహనం ధ్వంసం కేసులో 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో కొందరు రైతులు, బీజేపీ నేతలు ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top