పీజీ వైద్య విద్య సీట్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌ | Kaloji Health University Conducting Web Counseling For PG Medical Education Seats | Sakshi
Sakshi News home page

పీజీ వైద్య విద్య సీట్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌

Nov 7 2022 2:56 AM | Updated on Nov 7 2022 2:56 AM

Kaloji Health University Conducting Web Counseling For PG Medical Education Seats - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పీజీ వైద్య విద్య యాజమాన్య కోటా సీట్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌  నిర్వహిస్తున్నట్లు కాళోజి హెల్త్‌ యూనివర్సిటీ తెలిపింది. ఈ మేరకు ఆదివారం రెండో విడత ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో ఉన్న యాజమాన్య కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.

సీట్ల ఖాళీ ల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌ లో పొందుపరిచారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి అదే రోజు రాత్రి 8 గంటల వరకు ప్రాధాన్య క్రమంలో కళాశాలల వారిగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ www.knruhs.telangana.gov.inలో చూడా లని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో సూచించాయి.  

Advertisement
 
Advertisement
Advertisement