వరంగల్ ఎన్ఐటీకి ఉద్యోగాల పంట.. అత్యధిక ప్యాకేజీ 62.5 లక్షలు

Jobs For NIT Warangal Students, With Highest Pay Package Of Rs 62 Lakh PA - Sakshi

ఏడాది లో వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు

ఉద్యోగాలు పొందిన వారిలో 630 మంది బీటెక్, 370 మంది పీజీ విద్యార్థులు

వరంగల్ ఎన్ఐటీకి ఉద్యోగాల పంట పండింది. ఏడాదిలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. ప్రముఖ కంపెనీలో అత్యధిక ప్యాకేజీ ఏడాదికి 62 లక్షల 50 వేల వేతనంతో ఉద్యోగం పొందిన విద్యార్థులు ఎన్ఐటీకి చెందిన వారే కావడం విశేషం. 

సాక్షి, వరంగల్‌: వరంగల్ ఎన్ఐటీ మరో అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. ఇటీవల గేట్ 2022 లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఘనత ఎన్ఐటి విద్యార్థికే దక్కగా తాజాగా ఏడాదిలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలు పొంది సరికొత్త రికార్డు సృష్టించింది. క్యాపస్ డ్రైవ్ ద్వారా 250 కంపెనీల్లో 630 మంది బీటెక్ విద్యార్థులు, 386 మంది పిజి విద్యార్థులు ఉద్యోగాలు పొందారని ఎన్ఐటీ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు.‌ మరో 50 మంది విద్యార్థులు ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు పొందారని చెప్పారు.

2019-20 సంవత్సరంలో 792 మంది  2020-21లో 839 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందితే ఈసంవత్సరం ఇప్పటి వరకు 1016మంది ఉద్యోగాలు పొందారని తెలిపారు. ఉద్యోగాలు పొందిన వారిలో అత్యధికంగా ఏడాదికి 62 లక్షల 50 వేల వేతనంతో గౌరవ్ సింగ్, ప్రియాంష్ మహేశ్వరి దెశహ్ కంపెనీలో పని చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగాలు పొందిన వారిలో సగటున 14.5లక్షల ప్యాకేజీ లభించిందని డైరెక్టర్ ప్రకటించారు.

450 కంటే ఎక్కువ మంది ఫ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు వివిధ కంపెనీల నుండి ఇంటర్న్‌షిప్‌ ఆఫర్ పొందారని, నెలకు 20 వేల నుండి లక్ష అరవై వేల వరకు స్టైఫండ్ వస్తుందని తెలిపారు. ప్రభావంతో క్యాంపస్ ఇంటర్వ్యూలు అనుకున్నన్ని జరగకపోయినా పెద్ద మొత్తంలో ఉద్యోగాలు లభించడం  హర్షనీయమని, రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయని డైరెక్టర్ ఎన్వీ రమణ రావు స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top