breaking news
Warangal Nit student
-
వరంగల్ ఎన్ఐటీకి ఉద్యోగాల పంట.. అత్యధిక ప్యాకేజీ 62.5 లక్షలు
వరంగల్ ఎన్ఐటీకి ఉద్యోగాల పంట పండింది. ఏడాదిలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. ప్రముఖ కంపెనీలో అత్యధిక ప్యాకేజీ ఏడాదికి 62 లక్షల 50 వేల వేతనంతో ఉద్యోగం పొందిన విద్యార్థులు ఎన్ఐటీకి చెందిన వారే కావడం విశేషం. సాక్షి, వరంగల్: వరంగల్ ఎన్ఐటీ మరో అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. ఇటీవల గేట్ 2022 లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఘనత ఎన్ఐటి విద్యార్థికే దక్కగా తాజాగా ఏడాదిలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలు పొంది సరికొత్త రికార్డు సృష్టించింది. క్యాపస్ డ్రైవ్ ద్వారా 250 కంపెనీల్లో 630 మంది బీటెక్ విద్యార్థులు, 386 మంది పిజి విద్యార్థులు ఉద్యోగాలు పొందారని ఎన్ఐటీ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు. మరో 50 మంది విద్యార్థులు ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు పొందారని చెప్పారు. 2019-20 సంవత్సరంలో 792 మంది 2020-21లో 839 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందితే ఈసంవత్సరం ఇప్పటి వరకు 1016మంది ఉద్యోగాలు పొందారని తెలిపారు. ఉద్యోగాలు పొందిన వారిలో అత్యధికంగా ఏడాదికి 62 లక్షల 50 వేల వేతనంతో గౌరవ్ సింగ్, ప్రియాంష్ మహేశ్వరి దెశహ్ కంపెనీలో పని చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగాలు పొందిన వారిలో సగటున 14.5లక్షల ప్యాకేజీ లభించిందని డైరెక్టర్ ప్రకటించారు. 450 కంటే ఎక్కువ మంది ఫ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు వివిధ కంపెనీల నుండి ఇంటర్న్‌షిప్ ఆఫర్ పొందారని, నెలకు 20 వేల నుండి లక్ష అరవై వేల వరకు స్టైఫండ్ వస్తుందని తెలిపారు. ప్రభావంతో క్యాంపస్ ఇంటర్వ్యూలు అనుకున్నన్ని జరగకపోయినా పెద్ద మొత్తంలో ఉద్యోగాలు లభించడం హర్షనీయమని, రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయని డైరెక్టర్ ఎన్వీ రమణ రావు స్పష్టం చేశారు. -
నిట్ విద్యార్థికి లుకేమియా
వైద్యానికి రూ.40 లక్షలు.. ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు గార్ల(ఇల్లందు)/కాజీపేట అర్బన్: వరంగల్ నిట్ విద్యార్థి తేజావత్ మంగీలాల్ లుకేమియా వ్యాధి బారిన పడగా వైద్య ఖర్చుకు డబ్బు లేకపోవడంతో ప్రభుత్వం, దాతలు ఆదుకో వాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. మహబూబా బాద్ జిల్లా గార్ల మండలం పుల్లూరు జీపీ పరిధి చిన్నబంజారకి చెందిన తేజావత్ మంచ, రంగీ దంపతులు నిరుపేద కూలీలు. వారి కుమారుడు మంగీలాల్ వరంగల్ నిట్‌లో ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్నాడు. ఎలాంటి కోచింగ్‌కు వెళ్లకుండా, ఇంటి వద్దే చదివి నిట్‌లో సీటు సాధించాడు. గతేడాదే మంగీలాల్ ఈ వ్యాధి బారిన పడ్డాడు. అదే గ్రామానికి చెందిన బంజార సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు తేజావత్ జోగిరాం రూ.80 వేలు, ట్రైబల్ సోషల్ వెల్ఫేర్ కమిషనర్ ద్వారా రూ.1.50 లక్షల వరకు ఆర్థికసాయం అందించి వైద్యం చేయించారు. ఆరు నెలల తర్వాత వ్యాధి మళ్లీ తిరగబడింది. హైదరాబాద్ లోని కేన్సర్ ఆస్పత్రి వైద్యులు పరీక్షలు చేసి లుకేమియా వ్యాధి సోకిందని, వైద్యం కోసం రూ.40 లక్షలు ఖర్చవుతాయని చెప్పారు. వైద్యం చేయించకపోతే మంగీలాల్ 3 నెలలపాటు మాత్రమే బతుకుతాడని తేల్చిచెప్పారు. తల్లిదండ్రులు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ప్రగతిభవన్‌కు పలుమార్లు వెళ్లగా సెక్యూరిటీ గార్డులు రానివ్వడం లేదని వాపోయారు. తమ కుమారుడిని ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని వేడుకుంటు న్నారు. తేజావత్ మంగీలాల్, ఎస్బీఐ అకౌంట్ నంబరు 353909 59584(సీఐఎఫ్ కోడ్: 88787660820, ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్బీఐఎన్ 0007167), వడ్డేపల్లి బ్రాంచ్, హన్మకొండలో విరాళాలు జమచేయాలని, 94400 64623 సెల్ నంబర్లో సంప్రదిం చాలని కోరుతున్నారు. కాగా, నిట్ విద్యార్థులు, స్నేహితులు మిలాప్ యాప్ ద్వారా రూ.11 లక్షలు సేకరించారు. ఇవి కేవలం కీమోథెరపీకి మాత్రమే సరిపోతాయని, బోన్‌మ్యారో చికిత్స కోసం డబ్బులు కావాలని విద్యార్థులు చెబుతున్నారు. వైద్యం చేయిస్తాం: కలెక్టర్ మహబూబాబాద్: మంగీలాల్‌కు మెరుగైన వైద్యం చేయిస్తామని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా అన్నారు. ఈ విషయాన్ని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆమె సానుకూలంగా స్పందించి నిమ్స్ డైరెక్టర్‌కు లేఖ రాశారు.