HYD: కీలక నేతతో పెట్టుబడుల లింక్.. బిల్డర్ సుబ్బారెడ్డి ఇంట ఐటీ సోదాలు

సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు చోట్ల ఐటీ అధికారుల మంగళవారం తెల్లవారుజామునే తనిఖీలు నిర్వహించారు. బంజారాహిల్స్, జూబీహిల్స్‌లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. వంశీరామ్ బిల్డర్ సుబ్బారెడ్డి ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలోనే బిల్డర్ సుబ్బారెడ్డి బంధువు జనార్ధన్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. ఏకకాలంలో 15 ఐటీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. దీంతో, వారి ఇంట్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాగా, తెలంగాణకు చెందిన కీలక రాజకీయ నేతకు సంబంధించిన పెట్టుబడుల విషయానికి సంబంధించి ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అందులో భాగంగానే ఈ దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది.