బిల్డర్ల కార్యాలయాల్లో ఐటీ దాడులు
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ పట్టణానికి చెందిన బిల్డర్ల కార్యాలయాల్లో బుధవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిం చారు. నిర్మాణాలను పరిశీలించి వారి కార్యాల యాల్లో తనిఖీలు చేశారు. బిల్డర్లు మారుతి రావు, శ్రవణ్, కిషోర్రెడ్డిలను అధికారులు ప్రశ్నించారు. పట్టణంలోని అద్దంకి-నార్కట్‌పల్లి రోడ్డులో ఉన్న శరణ్య గ్రీన్ హోం, భవ్య కన్స్ట్రక్షన్, కృష్ణమానస కన్స్ట్రక్షన్లతో పాటు గణేష్ మార్కెట్లోని స్ఫూర్తి చిట్‌ఫండ్స్‌లో తనిఖీలు చేశారు. రికార్డులను పరిశీలించిన అనంతరం కీలక పత్రాలు తీసుకెళ్లారు. ఆదాయ పన్నుశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.
ఏక కాలంలో దాడులు
ఆదాయ పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఏక కాలంలో తొమ్మిది మందితో కూడిన అధికారుల బృందం ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ఉదయం 11 గం ట ల నుంచి రాత్రి వరకు కార్యాలయాల్లో తని ఖీలు నిర్వహించారు. బిల్డింగ్‌లకు సంబంధించిన డాక్యుమెంట్లు, బ్యాంకు రుణాలకు సంబంధించిన, ఇతర పత్రాలను కూడా పరిశీలించారు.
ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే కారణంతోనే..
ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే కారణంతోనే ఆదాయ పన్ను శాఖ అధికారు లు బుధవారం దాడులు నిర్వహించినట్లు సమాచారం. మిర్యాలగూడకు చెందిన ఇద్దరి బిల్డర్లపై ఆదాయపు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినందువల్లనే తనిఖీలు చేసినట్లు తెలిసింది. సోదాలు పూర్తయిన తరువాతనే వివరాలు వెల్లడిస్తామమని తెలిపారు.