హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం ప్రారంభం

International Arbitration Center Starts At Hyderabad - Sakshi

ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో అంతర్జాతీయ వాణిజ్య వివాదాల (ఆర్బిట్రేషన్‌) మధ్యవర్తిత్వ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి, తెలంగాణ న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి ఈ ఆర్బిట్రేషన్‌ కేంద్రం వేదికగా మారనుంది. అంతేకాక ఈ కేంద్రం ఏర్పాటుతో అంతర్జాతీయ ఆర్బిట్రేటర్లు హైదరాబాద్‌కు తరలి వస్తారు. 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌లో మొదటి ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటు చేసే అవకాశం కల్పించినందుకు గాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణకు ధన్యవాదాలు. సింగపూర్, దుబాయ్‌లో ఆర్బిట్రేషన్‌ సెంటర్‌లను చూసి భారత్‌లో ఇది ఉండాలని మీరు స్పందించినందుకు‌ ధన్యవాదాలు. సెంటర్‌లో త్వరలోనే పనులు ప్రారంభం‌ కావాలని‌ కోరుకుంటున్నాను. అది మీ చేతులమీదగానే జరగాలి. దానికి‌ తెలంగాణ ప్రభుత్వం పూర్తి సపోర్ట్ ఉంటుంది’’ అని తెలిపారు. 

హైదరాబాద్‌కు సీజే..
మూడు రోజుల పర్యటనలో భాగంగా జస్టిస్‌ ఎన్‌వీ రమణ గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన నగరానికి వచ్చారు. సోమవారం తిరిగి ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top