భారత్‌లో ఐఎస్‌బీ నంబర్‌–1

Indian School of Business Programme Ranked First in India - Sakshi

ఫైనాన్షియల్‌ టైమ్స్‌–2020 ఈఎంబీఏ ర్యాంకింగ్స్‌

సాక్షి, హైదరాబాద్‌: గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) మరో అరుదైన గుర్తింపు సాధించింది.  ఫైనాన్షియల్‌ టైమ్స్‌–2020 సోమవారం ప్రకటించిన ఈఎంబీఏ ర్యాంకింగ్స్‌లో పీజీ పీమ్యాక్స్‌ కోర్సు నిర్వహణతో దేశంలోకే ఐఎస్‌బీ మొదటి స్థానం పొందగా, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 53వ స్థానం పొందింది.  (క్యాబ్‌ చార్జీలు; డ్రైరన్‌ పేరిట బాదుడు)

  • ఐఎస్‌బీలో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్స్, వ్యాపార యజమానులకు కనీసం 10 ఏళ్ల అనుభవం ఉన్న 15 నెలల కాలపరిమితితో కూడిన గ్లోబల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ స్థాయి ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. 2017  పీజీ పీమ్యాక్స్‌ క్లాస్‌ నుంచి ఐఎస్‌బీ పూర్వ విద్యార్థులు ఈ ఏడాది ర్యాంకింగ్‌ కోసం సర్వే చేయబడ్డారు.
  • ప్రధానంగా లక్ష్యాల సాధన, జీతాల పెంపుదల, ప్రస్తుత జీతాలు, కెరియర్‌ ప్రొగ్రామ్స్‌ నిర్వహణ, మహిళా ఫ్యాకల్టీ, విద్యార్థినులు, అంతర్జాతీయ ఫ్యాకల్టీ, అంతర్జాతీయ విద్యార్థులు వంటి అంశాలపై పరిశీలించి ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ర్యాంక్‌లను ప్రకటించింది. గతేడాది 52వ ర్యాంక్‌ పొందగా ఈ ఏడాది 53 వస్థానం పొందగలిగింది.  
  • తాజా ర్యాకింగ్స్‌ వల్ల ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ ప్రాముఖ్యతతో పాటు ఐఎస్‌బీ ప్రాధాన్యత పెరిగిందని డీన్‌  ప్రొఫెసర్‌ రాజేంద్రశ్రీవాత్సవ అన్నారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top