పోలీస్‌ స్టేషన్‌లో యువతి బర్త్‌ డే వేడుకలు.. ఎందుకో తెలుసా? | Hyderabad: Young Woman Celebrates Birthday in Sultan Bazar Police Station | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్‌లో యువతి బర్త్‌ డే వేడుకలు.. ఎందుకో తెలుసా?

Nov 29 2022 3:42 PM | Updated on Nov 29 2022 3:42 PM

Hyderabad: Young Woman Celebrates Birthday in Sultan Bazar Police Station - Sakshi

సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆమె కేక్‌కట్‌ చేసి జన్మదిన వేడుకలను జరుపుకొంది.

సాక్షి, హైదరాబాద్: జన్మదినం రోజు ఓ ఫిర్యాదురాలికి సుల్తాన్‌బజార్‌ పోలీసులు వినూత్న బహుమతి ఇచ్చారు. వివరాలు.. జియాగూడకు చెందిన జి.భార్గవి పుట్టిన రోజు సందర్భంగా బొగ్గులకుంటలోని రాయల్‌ టిఫిన్‌ సెంటర్‌ వద్ద తన ద్విచక్ర వాహనాన్ని పార్క్‌ చేసింది. 

టిఫిన్‌ చేసి బయటకు రావడంతో బైక్‌ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుల్తాన్‌ బజార్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలగంగిరెడ్డి సిబ్బందిని అలర్ట్‌ చేసి వెంటనే బైక్‌ను భార్గవికి అందజేశారు. దీంతో ఆమె పోలీస్‌స్టేషన్‌లో కేక్‌కట్‌ చేసి జన్మదిన వేడుకలను జరుపుకొంది. పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది. (క్లిక్‌ చేయండి: డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీ కార్డుల జారీపై కీలక నిర్ణయం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement