‘సర్కారు వారి పాట’ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. ట్రాఫిక్‌ ఆంక్షలు విధింపు

Hyderabad: Traffic Restrictions Over Sarkaru Vari Pata Pre Release Event - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శనివారం(మే 7న) సాయంత్రం 6 గంటలకు యూసుఫ్‌గూడలోని 1వ టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్‌ గ్రౌండ్‌లో ‘సర్కారు వారి పాట’ప్రీ రిలీజ్‌ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. నిర్వాహకులు జారీ చేసిన హోలోగ్రాం ఉన్న పాస్‌లు, సీరియల్‌ నంబర్‌ ఉన్న అభిమానులకు మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. 

ట్రాఫిక్‌ మళ్లింపులు ఉండే ప్రాంతాలివే.. 
► మైత్రీవనం నుంచి వచ్చే బస్సులు, భారీ వాహనాలు యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్‌ వైపు అనుమతించరు. సవేరా ఫంక్షన్‌ హాల్‌ వద్ద కృష్ణకాంత్‌ పార్క్‌–కల్యాణ్‌ నగర్‌ వైపు, సత్యసాయి నిగమాగమం–కమలాపురి కాలనీ–కృష్ణనగర్‌–జూబ్లీహిల్స్‌ వైపు ట్రాఫిక్‌ మళ్లిస్తారు. 
► జూబ్లీహిల్స్‌ నుంచి వచ్చే వాహనాలు యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్‌ వైపు అనుమతించరు. శ్రీనగర్‌ కాలనీ సత్యసాయి నిగమాగమం వైపు మళ్లిస్తారు. 

పార్కింగ్‌ ప్రదేశాలివే..
► మహమూద్‌ ఫంక్షన్‌ ప్యాలెస్‌లో కేవలం కార్లను మాత్రమే పార్కింగ్‌ చేయాలి. దీని సామర్థ్యం 70 కార్లు. 
► సవేరా ఫంక్షన్‌ హాల్‌ ఎదురుగా ఉన్న మైదానంలో 2, 4 వీలర్‌ వాహనాలకు మాత్రమే. 200 కార్లు, 700 ద్విచక్ర వాహనాల పార్కింగ్‌ సామర్థ్యం 
► యూసుఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాలలో ద్విచక్ర వాహనాలకు మాత్రమే పార్కింగ్‌ అనుమతి. సామర్థ్యం 200 బైక్స్‌. 
► యూసుఫ్‌గూడ మెట్రో స్టేషన్‌లో కూడా కేవలం 2 వీలర్లకే పార్కింగ్‌. సామర్థ్యం 500 వాహనాలు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top