బ్లాక్‌ ఫిలిం ఉంటే బుక్కైపోతారు జాగ్రత్త!

Hyderabad Traffic Police Removed Tinted Film on Car Windows - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిబంధనల ప్రకారం కారు అద్దాలకు ఎలాంటి తెరలు ఏర్పాటు చేసినా, అద్దాలకు టింటెడ్‌ ఫిలింను ఏర్పాటు చేసుకున్నా కఠిన చర్యలు తప్పవని జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.ముత్తు హెచ్చరించారు. నగర ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్‌ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టులో ఆదివారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి కారు అద్దాలకు టింటెడ్‌ ఫిలిం అమర్చుకొని వెళ్తున్న వాహనదారులకు జరిమానాలు విధించి అద్దాలకు ఉన్న బ్లాక్‌ ఫిలింలను ఆయన తొలగింపజేశారు. 

కారులో ఎవరు వెళ్తున్నారు, ఎంత మంది వెళ్తున్నారు అనే దృశ్యాలు స్పష్టంగా కనిపించాలనే నిబంధన ఉన్నప్పటికీ కొంత మంది అవేవి పట్టించుకోకుండా నల్ల తెరలను ఏర్పాటు చేసుకొని యథేచ్ఛగా తిరుగుతున్నారని అలాంటి వారిని ఉపేక్షించమని ఆయన అన్నారు.

ఇదిలా ఉండగా శనివారం 93, ఆదివారం 82 వాహనాలను ఆపి బ్లాక్‌ ఫిలింలు తొలగింపజేశారు. ఆరు వాహనాలకు ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉండగా వాటిని తొలగించారు. మీడియాకు సంబంధం లేకుండా ఆరు స్కూటర్లకు ప్రెస్‌ ఆని రాసి ఉందని వాటిని తొలగించామని తెలిపారు. (క్లిక్: ఐటీ కారిడార్‌లలో వజ్ర పరుగులు.. చార్జీలు ఎంతంటే?)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top