గడువు సమీపిస్తున్నా....కనిపించని అన్వేషణ
సర్కారు భవనాల్లోకి కార్యాలయాల తరలింపు ప్రశ్నార్థకం.?
30 శాతానికిపైగా ఆఫీసులు కిరాయికే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అద్దె భవనాలలో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విద్యా సంస్థలు ప్రభుత్వ భవనాల్లోకి తరలింపు ప్రశ్నార్ధకంగా మారింది. కొన్ని చోట్ల ప్రభుత్వ భవనాలు ఖాళీగా వెక్కిరిస్తున్నా.. అవి అనువుగా లేవంటూ కొందరు అధికారులు ఖాళీ చేసేందుకు అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. అద్దె భవనాలను వెంటనే ఖాళీ చేయాలని డిసెంబరు 31నాటికి గడువు విధించి మరో నెల వెసులు బాటు కల్పించింది. ఏకంగా ఫిబ్రవరి నుంచి అద్దె చెల్లింపు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో సుమారు 30 శాతానికి పైగా సర్కారు కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటిలో అధికంగా స్టాంప్ అండ్ రిజి్రస్టేషన్, ఆర్‌టీఓ, పాఠశాలలు, బస్తీ దవఖానాలు, అంగ¯Œన్‌వాడి కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయి. దీంతో ఏటా అద్దెల పేరుతో కోట్లాది రూపాయలు చెల్లించాల్సి వస్తోంది.
తరలింపు వద్దని యజమానుల ఒత్తిడి
నగరంలోని కొన్ని భవనాల యజమానులు సర్కారు ఆఫీసులు ఖాళీ చేయకుండా విభాగ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఏదోరకంగా కొన్ని నెలలు ఖాళీ చేయకుండా చూస్తే ఆ తర్వాత తాము చూసుకుంటామని పేర్కొంటున్నట్లు సమాచారం. తమ భవనాలు ఖాళీ అయితే అంతమొత్తం అద్దె రాదని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వాస్తవంగా సరైన మౌళిక సదుపాయాలు లేకున్నా.. ప్రభుత్వం పెద్ద మొత్తంలో అద్దె చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.
సగానికిపైగా ఖాళీ
ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కార్యాలయాలు క్రమంగా విజయవాడకు తరలిపోయాయి. దీంతో పలు భవన సముదాయాలు ఖాళీగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో పరిశ్రమ భవన్, గగ¯Œ∙ విహార్ కాంప్లెక్స్, బీఆర్‌కేఆర్ భవన్, ఎర్రమంజిల్ వంటి పెద్ద భవనాల్లో సగానికి పైగా ఖాళీగా కనిపిస్తున్నాయి.
159 పాఠశాలలు అద్దె భవనాల్లోనే..
హైదరాబాద్‌లోని 16 మండలాల్లో 713 ప్రభుత్వ పాఠశాలల్లో 446 చోట్ల సొంత భవనాలుండగా.. మరో 68 పాఠశాలలు జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాళ్లలో, 40 బడులు వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయి. మిగతా 159 పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అత్యధికంగా చారి్మనార్, బహదూర్‌పురా వంటి ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు దశాబ్దాలుగా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. నాంపల్లి మండలంలోని బజార్–ఎ–జుమేరత్ ప్రాథమిక పాఠశాల 1975 నుంచి, కోట్లా అలీజా బాలికల హైసూ్కల్ 1995 నుంచి అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. మొత్తంమీద నెలవారీ కిరాయి సుమారు రూ.10లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ప్రభుత్వం చెల్లిస్తోంది..మరోవైపు బస్తీ దవాఖానాలదీ ఇదే పరిస్థితి.


