మాదాపూర్‌కు చెందిన ఓ ఐటీ ఉద్యోగికి రూ.లక్షల్లో వేతనం. ఇటీవల ఓ డేటింగ్ యాప్‌లో ఉత్తరాదికి చెందిన యువతితో పరిచయమైంది. తాను హైదరాబాద్ వచ్చానని, హైటెక్ సిటీలోని ఓ పబ్‌లో కలుద్దామని చెప్పింది. అతడు హుషారుగా పబ్‌కు వెళ్లాడు. ఖరీదైన మద్యం, ఫుడ్ ఆమె ఆర్డర్ చేసింది. గంట లోపే రూ.56 వేలు బిల్లు అయింది. తనకు ఫోనొచి్చందంటూ పబ్ నుంచి ఆమె చిన్నగా జారుకుంది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో బాధితుడు బిల్లు కట్టేసి ఇంటికెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆ కిలేడీ సోషల్ మీడియాలో ప్రొఫైల్ అన్నీ బ్లాక్ చేసింది. ఇదేదో డేటింగ్ యాప్ మోసం కాదు. నగరంలోని పలు పబ్ నిర్వాహకులు ఉత్తరాది అమ్మాయిలతో కలిసి యువకులను చీటింగ్ చేస్తున్న తీరు. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న మోష్ పబ్ నిర్వాహకుడు, ఢిల్లీ ముఠాకు చెందిన ఏడుగురిని సైబరాబాద్ పోలీసులు గతంలో అరెస్టు చేశారు.
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్, మాదాపూర్, గచి్చ»ౌలి, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో వందకు పైగా పబ్‌లున్నాయి. వీటిలో చాలావరకు సరైన అమ్యూజ్‌మెంట్ లైసెన్స్‌లు లేవని సమాచారం. అర్ధరాత్రి దాటినా పబ్‌లు నడవడం, అశ్లీల నృత్యాలు, డ్రగ్స్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయన్న ఆరోపణలున్నాయి. పలు పబ్‌లు గంజాయి, కొకైన్, హెరాయిన్, ఎండీఎంఏ వంటి మత్తు పద్దారాలు పట్టుపడటం, అసాంఘిక కార్యకలాపాలు వెలుగులోకి వచి్చనా వాటి వెనక బడా రాజకీయ నాయకులు, సంపన్నుల పిల్లలు ఉండటంతో కేసులు నీరుగారిపోతున్నాయనే విమర్శలున్నాయి.
ఉత్తరాది అమ్మాయిలతో..
ఢిల్లీ, హరియాణా వంటి ఉత్తరాదికి చెందిన వ్యవస్థీకృత ముఠాలతో స్థానికంగా పలు పబ్ నిర్వాహకులు ఒప్పందాలు చేసుకుంటున్నారు. పాతికేళ్ల లోపు వయసున్న నిరుద్యోగ, పేద యువతులను పార్ట్ జాబ్ పేరుతో తీసుకుంటారు. వారికి భోజన, వసతి ఏర్పాట్లు చేస్తారు. టిండర్, బంబుల్, హ్యాపెన్, హింజ్ వంటి డేటింగ్ యాప్స్‌లలో అందమైన ఫొటోలతో ప్రొఫైల్స్ సృష్టిస్తారు. ఐటీ నిపుణులు, ఉన్నత ఉద్యోగులు, యువతను లక్ష్యంగా యాప్‌లలో పరిచయం చేసుకుంటున్నారు.
మాట కలిపి.. మాయ చేసి..
డేటింగ్ యాప్‌లో పరిచయమైన అమ్మాయి.. కొద్ది రోజుల్లోనే బాధితుడికి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తాను వ్యక్తిగత పని మీద నగరానికి వచ్చానని, ముందుగా ఎంపిక చేసుకున్న పబ్, కెఫే, రెస్టారెంట్‌లో కలుద్దామని ఒత్తిడి చేస్తుంది. దీంతో బాధితుడు ఆమె సూచించిన ప్రాంతానికి వెళ్లగానే.. మెనూ కార్డు చూడకుండానే ఖరీదైన పానీయాలు, ఆహారం, మద్యం వంటివి ఆర్డర్ చేస్తుంది. బిల్లు వచ్చేలోపే అక్కణ్నుంచి జారుకుంటుంది. ఇది తెలియక లోపలే వెయిట్ చేసే బాధితుడు ఎంతకీ తిరిగి రాకపోవడం, ఫోన్ స్విఛాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించి, బిల్లు కట్టేసి ఉస్సూరుమంటూ వెళ్లిపోతాడు. ఒకవేళ బిల్లు కట్టే పరిస్థితి లేకపోతే పబ్ యాజమాన్యాలు బౌన్సర్ల సహాయంతో బెదిరింపులు, దాడులు తప్పవు.
ఢిల్లీ ముఠా హైదరాబాద్‌లో 50–60 మందిని మోసం చేసి కేవలం 45 రోజులలోనే ఏకంగా రూ.30 లక్షలకు పైగా దోచుకుంది.


