Hyderabad City Police Issue Notice To Twitter On Fake Video Circulation - Sakshi
Sakshi News home page

ట్విటర్‌కు హైదరాబాద్‌ పోలీసుల నోటీసులు

Jun 17 2021 11:17 AM | Updated on Jun 17 2021 12:53 PM

Hyderabad City Police Issue Notice To Twitter On Fake Video Circulation - Sakshi

హైదరాబాద్‌:  మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విట‌ర్‌కు షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఒక కేసుకు సంబంధించి కేంద్రం నోటీసులు ఇవ్వగా, తాజాగా  హైదరాబాద్‌ పోలీసులు ట్విటర్‌కు నోటీసులు జారీ చేశారు. ఫేక్‌ వీడియో సర్క్యులేట్‌ కేసులో నోటీసులు పంపినట్లు హైదరాబాద్‌ పోలీసులు నోటీసులు ఇచ్చారు.  నటి మీరాచోప్రా ఫిర్యాదుపై ట్విట్టర్‌ వెంటనే స్పందించాలంటూ నోటీసులు పంపినట్లు సమాచారం.

కాగా, జూన్ 5న వృద్ధ ముస్లిం వ్యక్తిపై దాడి చేసిన కేసులో ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో  కూడా మంగళవారం రాత్రి థర్డ్ పార్టీకి సంబంధించిన మొదటి కేసు నమోదైంది. బాధితుడు తప్పుడు సమాచారమని వివరించినా ట్విటర్ చర్య తీసుకోలేదని ఆరోపించారు. త‌ప్పుదోవ ప‌ట్టించే స‌మాచారాన్ని ట్విట‌ర్ తొల‌గించ‌లేద‌ని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

చదవండి: ట్విటర్‌కు మరో షాక్‌, కేసు నమోదు

Advertisement
 
Advertisement
Advertisement