భార్యను బస్సెక్కించి..

Husband Observes Traffic Police Checking And Wife Get Into Bus - Sakshi

ట్రాఫిక్‌ పోలీసుల తనిఖీలను  గమనించి భార్యను బస్సెక్కించిన భర్త 

అడ్రస్‌ తెలియక ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సదరు మహిళ 

సాక్షి, శంషాబాద్‌: ట్రాఫిక్‌ పోలీసులు చేపడుతున్న తనిఖీలు ఓ జంటకు గొంతులో పచ్చిఎలక్కాయపడినట్లైంది. ఆదివారం ఓ జంట బైక్‌పై షాద్‌నగర్‌ నుంచి శంషాబాద్‌ వైపు వెళ్తుండగా.. మార్గమధ్యలో ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు చేపడుతుండటాన్ని చూశారు. భర్తకు హెల్మెట్‌ ఉంది కానీ, భార్యకు లేదు. దీంతో ఆ జంట ముందుకు పోలేక..వెనక్కి వెళ్లలేక ట్రాఫిక్‌ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు భర్త తన భార్యను బస్సెక్కించాడు.

ఐడియా బాగానే ఉన్నా...కాస్త ఇక్కట్ల పాలయ్యేలా చేసింది. శంషాబాద్‌లో బస్సు దిగాల్సిన భార్య అక్కడ దిగకుండా సాతంరాయి వద్ద బస్సు దిగింది. అక్కడ నుంచి తిరిగి శంషాబాద్‌ రావడానికి ఆటో ఎక్కగా ఆటోవాలా కాస్త ఆమెను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దించేశాడు. ఎయిర్‌పోర్టులో దిగిన సదరు మహిళ తాను తప్పిపోయానని తెలుసుకుని ఏడుస్తుండటంతో ఆమెను గమనించిన పోలీసులు షీ టీమ్‌కు అప్పగించగా.. వారు పూర్తి వివరాలు తెలుసుకుని ఆమెను భర్తకు అప్పగించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top