చినుకు చింత | Huge deficit in average rainfall | Sakshi
Sakshi News home page

చినుకు చింత

Jul 8 2026 2:04 AM | Updated on Jul 8 2026 2:04 AM

Huge deficit in average rainfall

మహా నగరంపై ఎల్‌నినో పడగ   

ముఖం చాటేసిన రుతుపవనాలు  

సగటు వర్షపాతంలో భారీ లోటు  

జూన్‌లో ఎండలాయే..  

ఈ నెల ఇప్పటికీ నిరాశాజనకమే..  

సాక్షి, హైదరాబాద్‌  :  వానాకాలం సీజన్‌ ప్రారంభమై దాదాపు నెల రోజులు దాటినా నగర పరిధిలో వర్షపాతం లోటు తీవ్రంగా వేధిస్తోంది. జూన్‌లో నైరుతి రుతుపవనాలు ఆశించిన స్థాయిలో విస్తరించలేదు. ఈ నెల మొదటి వారం (1 నుంచి 7 వరకు) పొడి వాతావరణమే కొనసాగుతోంది. సాధారణంగా ఈపాటికే చెరువులు, కుంటల్లోకి నీరు రావాల్సింది. ఆకాశం మేఘావృతమవుతున్నా ఆశించిన చినుకు రాలడం లేదు. పసిఫిక్‌ మహాసముద్రంలో ఏర్పడిన తీవ్రమైన ‘ఎల్‌నినో’ ప్రభావం సుదీర్ఘకాలం కొనసాగడం, అనుకూల ‘లానినా’ ఈ పరిస్థితికి ప్రధాన కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  

వర్షపాతం లోటు పునరావృతం 
జూలైలోనూ గత నెల సాధారణ వర్షపాతం లోటు పునరావతమవుతోంది. జూన్‌ లో నమోదు కావాల్సిన సగటు వర్షపాతంలో దాదాపు 20 నుంచి 45 శాతం భారీ లోటు నమోదైంది. ఆశలన్నీ జూలై నెలపైనే పెట్టుకోగా.. మొదటి వారంలోనూ అదే పరిస్థితి. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో చిరు జల్లులే కురిశాయి. రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం సాధారణ వర్షపాతం కంటే అధికంగానే నమోదైంది. వర్షపాతం లోటుతో జంట జలాశయాల నీటిమట్టం అంతంత మాత్రంగా ఉంది.  మూసీ, ఈసీ నదులు ఇంకా పొడిగానే ఉన్నాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement