మరో రెండు రోజులు భారీ వర్షాలు | Heavy Rains For Another Two Days In Telangana | Sakshi
Sakshi News home page

మరో రెండు రోజులు భారీ వర్షాలు

Oct 16 2020 2:40 AM | Updated on Oct 16 2020 4:37 AM

Heavy Rains For Another Two Days In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీనికి తోడు కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో వాయుగుండం ప్రభావమూ ఉందని తెలిపింది. అందువల్ల సరిహద్దు జిల్లాల్లో భారీగా మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఈ నెల 17 నుంచి మరో రెండ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement