
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇక, మరో మూడు గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం ఉదయం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించింది.
I'll be sharing a VERY IMPORTANT UPDATE tomorrow regarding the impact of DEEP DEPRESSION/CYCLONE SHAKTI impact on Telangana and EXTREME FLOODING RAINS in Telangana during Sep 26-27
Will be giving series of outlooks regarding extreme rainfall zones and it's probabilities due to…— Telangana Weatherman (@balaji25_t) September 21, 2025
ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్, నాగోల్, మన్సూరాబాద్, వనస్థలిపురం, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట, సహ పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి వాహనదారులు, ప్రయాణికులు అవస్థలు పడ్డారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పలు చోట్ల వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
రాగల 3 రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈనెల 25 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతం దాని సమీపంలోని ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ అల్పపీడనం దక్షిణ ఒడిశా.. ఉత్తరాంధ్ర కోస్తా తీరం సమీపంలో ఈనెల 26 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. ఈనెల 27 నాటికి అదే ప్రాంతంలో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వివరించారు.