తెలంగాణకు అలర్ట్‌.. నేడు ఏడు జిల్లాలో గట్టి వానలు | Heavy Rain Forecast To Many Districts In Telangana, Check Weather Update Tweet Inside | Sakshi
Sakshi News home page

Telangana Rainfall Update: తెలంగాణకు అలర్ట్‌.. నేడు ఏడు జిల్లాలో గట్టి వానలు

Sep 25 2024 8:30 AM | Updated on Sep 25 2024 9:31 AM

Heavy Rain Forecast To Many Districts In Telangana

 

సాక్షి, హైదరాబాద్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్ప పీడన ప్రభావంతో నేడు ఏడు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు  వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో బుధవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే, మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

 

 

ఇక, మంగళవారం అత్యధికంగా జనగామ జిల్లా దేవరుప్పులలో 11.5 సెం.మీ. వర్షం కురిసింది. నల్గొండ జిల్లా కామారెడ్డి గూడెంలో 10.9, తిమ్మాపూర్‌లో 9.9, శాలిగౌరారంలో 9.1, రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో 8.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో కూడా పలుచోట్లు  మోస్తరు వర్షం కురిసింది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది. 

 

ఇది  కూడా చదవండి: యాదాద్రి రాజగోపురానికి బంగారు తాపడం

Advertisement
 
Advertisement
Advertisement