జూబ్లీహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత | Heavy Drugs Bust In Jubilee Hills | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

Dec 31 2023 2:40 PM | Updated on Dec 31 2023 4:15 PM

Heavy Drugs Bust In Jubilee Hills - Sakshi

హైదరాబాద్‌: న్యూఇయర్ వేడుకలకు జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌లో ప్రముఖ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఈ ముఠాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 100 గ్రాముల ఎండీఎంఏ, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

డ్రగ్స్‌ కోసం ప్రత్యేక పరికరాలు 
న్యూఇయర్ వేళ డ్రగ్స్ విక్రయంపై పోలీసుల ఆంక్షలు విధించారు. డ్రగ్స్‌ను సేవిస్తే గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలు తెప్పించారు. డ్రగ్స్ తీసుకున్నారన్న అనుమానం వస్తే అక్కడిక్కడే పరీక్షలు నిర్వహించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. విద్యార్ధులపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఇదీ చదవండి: Hyderabad: ఇక తెల్లవార్లూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌!

Advertisement
 
Advertisement
Advertisement