ఉస్మానియా కూల్చివేతపై హైకోర్టులో విచారణ

సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేత, నూతన భవన నిర్మాణంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఉస్మానియా పురాతన కట్టడం అని దానిని కూల్చివేయకుండా అడ్డుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే, ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరిందని, దానిని తొలగించి నూతన భవనం నిర్మిస్తామని ప్రభుత్వం ఈ సందర్భంగా కోర్టుకు వివరించింది. కొత్త నిర్మాణానికి సంబంధించి పూర్తి వివరాలతో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. అయితే ఎర్రమంజిల్ భవనంపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించిన పిటిషనర్లు ఈ తీర్పు ఉస్మానియాకు కూడా వర్తిస్తుందని వాదించారు. పురాతన కట్టడాన్ని కూల్చివేయకుండా పక్కన ఉన్న16 ఎకరాల స్థలంలో నూతన నిర్మాణం చేపట్టాల్సిందిగా పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఉస్మానియా ఆసుపత్రి సైట్‌కి సంబంధించిన మొత్తం గూగుల్ మ్యాప్‌ను కోర్టుకు సమర్పించాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 8కి హైకోర్టు వాయిదా వేసింది. (‘యాంకర్ ప్రదీప్‌కు ఈ కేసుతో సంబంధం లేదు’)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి