
సాలెగూళ్లను తలపిస్తున్న విద్యుత్ స్తంభాలు
వరుస ప్రమాదాలతో హడావుడి
అడ్డగోలు పద్ధతిలో కేబుళ్ల కత్తిరింపు
సాక్షి, హైదరాబాద్ : సరఫరా చేసే ప్రతి యూనిట్‌ను పక్కాగా లెక్కించే సామర్థ్యం కలిగి ఉన్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ.. తన అ«దీనంలో ఉన్న విద్యుత్ స్తంభాలపై ఇప్పటికీ ఓ స్పష్టత లేకపోవడం అనేక అనుమానాలకు ఆస్కారం కల్పిస్తోంది.
ఏ సర్కిల్ పరిధిలో ఎన్ని విద్యుత్ స్తంభాలు ఉన్నాయి? ఎన్ని మీటర్ల దూరం విస్తరించి ఉన్నాయి? ఏ స్తంభంపై ఏయే కంపెనీలకు చెందిన ఎన్ని కేబుళ్లు వేలాడుతున్నాయి? వంటి కనీస వివరాలను సేకరించకపోవ డాన్ని పరిశీలిస్తే.. ఆడిట్ విషయంలో డిస్కం ఇంజినీర్ల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కుంగిపోతున్న స్తంభాలు
గ్రేటర్‌లో 33/11కేవీ సబ్‌స్టేషన్లు 498 ఉండగా, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు 1,022 ఉన్నాయి. 33కేవీ యూజీ కేబుల్ లైన్లు 1,280 కిలోమీటర్లు విస్తరించి ఉండగా, 33 కేవీ ఓవర్‌హెడ్‌లైన్లు 3,725 కిలోమీటర్లు, 11 కేవీ ఓవర్‌హైడల్ లైన్లు 21,643 కిలోమీటర్లు, 11కేవీ యూజీ కేబుల్ లైన్లు 957 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు 1,50,992 ఉండగా, వీటి పరిధిలో 63 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఫీడర్ నుంచి డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌కు వచ్చే 11 కేవీ స్తంభాలు ఎన్ని ఉన్నాయో తెలియదు. ట్రాన్స్‌ఫార్మర్ నుంచి గృహానికి విద్యుత్ సరఫరా చేసే 11 కేవీ ఎల్టీ స్తంభాలు ఎన్ని ఉన్నాయో కూడా సరైన లెక్కలేదు.
పర్యవేక్షణ లేదు.. ప్రమాణాలు పాటించరు
కరెంట్ సరఫరా, లైన్లు పర్యవేక్షణ, రెవెన్యూ వసూళ్లపై ప్రత్యేక ఆడిట్ ఉంది. గ్రేటర్‌లో స్టార్ కేబుళ్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్ సరీ్వసు ఆపరేటర్లు 30 మందికిపైగా ఉన్నట్లు అంచనా. నిజానికి విద్యుత్ సంస్థ కంటే ఇంటర్నెట్, స్టార్ కేబుళ్ల ఆదాయం ఎక్కువ. లైన్లు, కేబుళ్ల ఏర్పాటు విషయంలో విద్యుత్ సంస్థకు కొన్ని కచి్చతమైన ప్రమాణాలు, నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ కేబుల్ ఆపరేటర్లకు, సరీ్వసు ప్రొవైడర్లకు కనీస భద్రత ప్రమాణాలు, నియమ నిబంధనలు లేవు. వీరి పని తీరుపై పర్యవేక్షించే ప్రభుత్వ యంత్రాంగం కూడా లేదు. మార్కెట్లో తక్కువ ధరకు లభించే నాసిరకం కేబుళ్లు కొనుగోలు చేసి విద్యుత్ స్తంభాలపై వేలాడదీస్తున్నారు. ఈదురు గాలితో కూడిన వర్షాలకు తరచూ తెగిపడుతుండటంతో వాటికి సపోరి్టంగ్ కోసం జే వైర్లతో అనుసంధానిస్తున్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండా స్తంభాలకు జంక్షన్ బాక్సులను ఏర్పాటు చేయడంతో పాటు వాటికి అక్రమంగా కరెంట్ వాడుతున్నారు. ఈ విషయం ఇటు క్షేత్రస్థాయి ఇంజినీర్లు మొదలు..సీఎండీ వరకు తెలుసు కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క ఆపరేటర్‌పై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తాజాగా రామంతాపూర్, అంబర్‌పేట్, బండ్లగూడ ఘటనలతో అప్రమత్తమైన డిస్కం.. స్తంభాలకు వేలాడుతున్న వైర్లను తొలగించే పని మొదలు పెట్టింది. అయితే.. ఇప్పటికే డిస్కం నిర్ణయించిన చార్జీలు చెల్లించి, స్తంభాల ద్వారా కేబుళ్లను ఏర్పాటు చేసుకున్న సరీ్వసు ప్రొవైడర్లు డిస్కం ఇంజినీర్ల తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా అన్ని అనుమతులు తీసుకున్న తమ కేబుళ్లను కూడా తొలగించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
1.73 లక్షల స్తంభాలకే అనుమతులు..
నగరంలో ఎల్టీ 11కేవీ, 33 కేవీ సహా అన్ని రకాల విద్యుత్ స్తంభాలు 20 లక్షలకుపైగా ఉన్నట్లు డిస్కం ప్రకటించింది. వీటిలో 1.73 స్తంభాల వినియోగానికి మాత్రమే ఆయా సరీ్వసు ప్రొవైడర్లకు అనుమతి ఉన్నట్లు పేర్కొంది. ఆప్టికల్ ఫైబర్ కేబుల్, కో–యాక్సిల్ (లోపల మెటల్ కండక్టర్‌తో ఇన్సులేషన్ ఉన్న కేబుల్ టీవీ వైర్) కేబుల్స్ వాడుతున్నట్లు తెలిపింది. ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను విద్యుత్ స్తంభాలపై వేయడం సహా భద్రతా చర్యలను అమలు చేయడం ఆయా ఏజెన్సీదే పూర్తి బాధ్యత. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేసిన విద్యుత్ స్తంభాలను సులభంగా గుర్తించేందుకు వాటిపై పెయింటింగ్ తప్పనిసరిగా చేయాలి.
విద్యుత్ స్తంభాలపై బ్యాక్‌హాల్ ఎక్విప్‌మెంట్ వంటి అదనపు పరికరాలను ఇన్‌స్టాల్ చేయరాదు. అనుమతించిన సంఖ్యకు
మించి స్తంభాలను ఉపయోగించకూడదు. సమీపంలోని లైన్ల నుంచి విద్యుత్ సరఫరాను డైరెక్ట్ ట్యాపింగ్ చేయరాదు. కానీ.. అనేక ప్రదేశాలలో కేబుల్స్ కిందికి 5
అడుగుల ఎత్తులో వదిలేస్తున్నారు. కాంక్రీట్ మిక్సర్ వాహనాలు, బోర్ డ్రిల్లింగ్ వంటి భారీ వాహనాలు రోడ్డును దాటేటప్పుడు తక్కువ ఎత్తులో వేయబడిన ఈ కేబుల్స్ వల్ల విద్యుత్ నెట్‌వర్క్‌కు భారీ నష్టం వాటిల్లుతోంది. ఐఎస్‌పీలు, కేబుల్ ఆపరేటర్లు కొత్త కనెక్షన్ కోసం కేబుల్ వేస్తున్నారే కానీ ఇప్పటికే పాడైన, వినియోగంలో లేని కేబుల్స్‌ను తొలగించట్లేదు. ఇవి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అనుమతి తీసుకున్న కేబుళ్లను కూడా గుర్తించే పరిస్థితి లేకపోవడంతోనే అన్ని తీగలను తొలగించాల్సి వస్తోందని డిస్కం స్పష్టం చేస్తోంది.