‘అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చారు.. మా పోస్టింగ్‌ ఆర్డర్లు ఏవి?’ | Group 1 Candidates Meet Minister Damodara Raja Narasimha | Sakshi
Sakshi News home page

‘అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చారు.. మా పోస్టింగ్‌ ఆర్డర్లు ఏవి?’

Nov 6 2025 6:25 PM | Updated on Nov 6 2025 8:12 PM

Group 1 Candidates Meet Minister Damodara Raja Narasimha

హైదరాబాద్‌:  సెప్టెంబర్‌ నెలలో అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చి  ఇప్పటివరకూ పోస్టింగ్‌ ఆర్డర్లు ఇవ్వకపోవడంపై తెలంగాణకు చెందిన గ్రూప్‌-1 అభ్యర్థులు ఆందోళనగా ఉన్నారు. అపాయింట్‌మెంట్‌ లేఖలు ఇచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకూ పోస్టింగ్‌ ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఈ మేరకు మంత్రి దామోదర రాజనర్సింహతో గ్రూప్‌-1 అభ్యర్థులు ఈరోజు(గురువారం, నవంబర్‌ 6వ తేదీ) భేటీ అయ్యారు. తమ పోస్టింగ్‌ అంశానికి సంబంధించి మంత్రి రాజనర్సింహకు విన్నవించారు. 

ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 562 గ్రూప్‌-1 అభ్యర్థులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేసిన సంగతి తెలిసిందే.. ఈ నియామక పత్రాలను హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఒక కార్యక్రమంలో అందించారు. గ్రూప్‌-1 విజేతలకు తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యత ఉందని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 
 ఈ సందర్భంగా, తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే జీతంలోంచి కొంత కట్ చేసి వారి ఖాతాల్లో వేస్తామని కూడా సీఎం రేవంత్‌ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement