సూర్యాపేట టౌన్: మూడేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసిన ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. సూర్యాపేట పట్టణంలోని తిలక్‌నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను అద్దె భవనంలో నడిపిస్తున్నారు. మూడేళ్లుగా భవనానికి అద్దె చెల్లించకపోవడంతో భవన యజమాని సోమవారం తాళం వేశారు. దీంతో ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు బయటనే నిరీక్షించాల్సి వచి్చంది.
మూడేళ్ల కిరాయి ఇవ్వాల్సింది నిజమేనని పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు. భవన యజమాని ఏడాది ప్రారంభంలోనే కిరాయి బకాయిల గురించి అధికారులకు తెలియజేసినట్టు చెబుతున్నాడు. ఈ సంవత్సరానికి సంబంధించిన ఆరు నెలల కిరాయి మాత్రమే మంజూరైనట్లు అధికారులు చెప్తున్నారు. స్కూల్ గేటుకు తాళం వేసిన నేపథ్యంలో అధికారులు విద్యార్థులను సమీపంలోని హైస్కూల్‌కు తరలించారు. బకాయిల సమస్యను త్వరగా పరిష్కరించి, పాఠశాల నిర్వహణకు శాశ్వత ఏర్పాట్లు చేయాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.


