సూర్యాపేట: చిట్టీల పేరుతో రాజు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు చాలా మందిని నిండా ముంచాడు. చివ్వెంల, సూర్యాపేట, ఆత్మకూరు(ఎస్) మండలాల్లో అతడి చేతిలో జనాలు మోసపోయారు. రూ.10 కోట్ల వరకు వసూలు చేసి అతడు పరారయ్యాడు. 10 రోజులుగా ఇంటికి తాళం వేసి ఉండటంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది.
ఆత్మకూరు (ఎస్) మండలం శెట్టిగూడెంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు రాజు. కాగా, చిట్టీల పేరుతో చాలా మంది మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇటీవల పలు ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.


