breaking news
chit amount
-
చిట్టీల పేరుతో జనాలను నిండా ముంచిన టీచర్
సూర్యాపేట: చిట్టీల పేరుతో రాజు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు చాలా మందిని నిండా ముంచాడు. చివ్వెంల, సూర్యాపేట, ఆత్మకూరు(ఎస్) మండలాల్లో అతడి చేతిలో జనాలు మోసపోయారు. రూ.10 కోట్ల వరకు వసూలు చేసి అతడు పరారయ్యాడు. 10 రోజులుగా ఇంటికి తాళం వేసి ఉండటంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది. ఆత్మకూరు (ఎస్) మండలం శెట్టిగూడెంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు రాజు. కాగా, చిట్టీల పేరుతో చాలా మంది మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇటీవల పలు ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. -
చిట్టీల పేరుతో రూ.4 కోట్లకు కుచ్చుటోపీ
విజయవాడ : చిత్తూరు జిల్లాలో వనజాక్షి ఘటన మరవక ముందే విజయవాడలో చిట్టీల పేరుతో ఓ మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. చిట్టీ డబ్బులను సొంత అవసరాలకు వినియోగించుకుని సభ్యులకు ఎగనామం పెట్టింది. పటమటకు చెందిన రుక్మిణి అనే చిట్టీ నిర్వాహకురాలు సుమారు రూ.4 కోట్లు వసూలు చేసి, ఆనక బిచాణా ఎత్తేసింది. ఈ విషయం తెలుసుకున్న బాధితులు ...రుక్మిణి ఇంటిపై దాడి చేశారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


