
ఆసక్తి వ్యక్తీకరణ కోరిన నీటిపారుదల శాఖ
డిజైన్లు సీడబ్ల్యూసీ ఆమోదించాల్సి ఉంటుందని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణకు డిజైన్లతో పాటు సమగ్ర పునరుద్ధరణ ప్రణాళికను అందించడా నికి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)ను ఆహ్వానిస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ బుధవారం ప్రకటన జారీ చేసింది. ఈ బరాజ్‌ల పున రుద్ధరణ విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ చేసిన సిఫారసులకు అనుగుణంగా డిజైన్లు అందించాలని కోరింది.
బరాజ్‌ల పటిష్టతపై మదింపు, హైడ్రాలజీ, హైడ్రాలిక్ రివ్యూ, వరదలు/భూకంపాలు వంటి విపత్తులను ఎదుర్కోవడంలో బరాజ్‌లకు ఉన్న సామర్థ్యం మదింపు, గేట్లు/ పియర్లు/ స్టిల్లింగ్ బేసిన్/కటాఫ్ వాల్స్ వంటి బరాజ్‌లలోని కీలక విభాగా లను పటిష్టం చేసేందుకు డిజైన్లు అందించడం వంటి సేవలను అందించాలని పేర్కొంది.
ప్రస్తుత డిజైన్లను పునఃసమీక్షించండి: బరాజ్‌ల ప్రస్తుత డిజైన్లతో పాటు ఎన్‌డీఎస్‌ఏ నివేదికల్లోని సిఫారసులను పునఃసమీక్షించాలని కోరింది. అవసరమైతే క్షేత్ర స్థాయిలో పర్యటించి జియోటెక్నికల్, జియోఫిజికల్ వంటి పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఈ పరీక్షల ద్వారా బరాజ్‌లలో ఉన్న అన్ని రకాల లోపాలను గుర్తించాలని కోరింది. ఎన్‌డీఎస్‌ఏ సిఫారసుల మేరకు మేడిగడ్డ బరాజ్‌లో కుంగిన 7వ బ్లాకును సుస్థిరం చేయడం లేదా సురక్షితంగా తొలగించే అంశంపై అధ్యయనం జరిపి తగిన పరిష్కారాలను సూచించాలని తెలిపింది.
ఎంపికైన సంస్థ అందించే డిజైన్లు, డ్రాయింగ్స్‌కు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదం తెలపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆసక్తి గల సంస్థ/జాయింట్ వెంచర్ కంపెనీ గత 15 ఏళ్లలో కనీసం ఒకటి రెండు ప్రాజెక్టుల పునరుద్ధరణ కోసం ఇలాంటి పనులు చేసి ఉండాలంటూ అర్హతలను నిర్దేశించింది.