గ్రేటర్‌ ఫలితాలు : గెలిచిన అభ్యర్థులు వీరే..

GHMC Elections Results : Winning Candidates List By Party Wise - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు 150 డివిజన్ల ఫలితాలకు గానూ 100 డివిజన్లలో తుది ఫలితాలు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ 54 స్థానాల్లో విజయం సాధించగా.. 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 99 స్థానాలు గెలిచిన టీఆర్‌ఎస్‌ ఈసారి మాత్రం 58-60 స్థానాల్లో మాత్రమే విజయం సాధించేలా కనిపిస్తోంది. కాగా గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలు మాత్రమే గెల్చుకున్న బీజేపీ ఈసారి మాత్రం సత్తా చాటింది. ఇప్పటివరకు 41 స్థానాల్లో జయకేతనం ఎగురవేయగా.. ఇంకా 4 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది. ఇక ఎంఐఎం తాను పోటీ చేసిన 52 స్థానాలకు గానూ 39 స్థానాల్లో గెలిచి.. మరో 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాగా పార్టీల వారిగా వివిధ పార్టీలకు చెందిన గెలిచిన అభ్యర్థులు వివరాలను ఒకసారి పరిశీలిస్తే..

టీఆర్ఎస్
కాప్రా - స్వర్ణ రాజ్
చర్లపల్లి - బొంతు శ్రీదేవి
శేరిలింగం పల్లి - రాగం నాగేందర్
బోరబండ - బాబా ఫసియుద్దీన్
భారతీ నగర్ - సింధూ ఆదర్శ్ రెడ్డి
మెట్టుగూడ - రాసూరి సునీత
సూరారం - మంత్రి సత్యనారాయణ
బాలాజీ నగర్ - పగడాల శిరీష
రంగా రెడ్డి నగర్ - శేఖర్ గౌడ్
కెపీహెచ్బీ - మందాడి శ్రీనివాస్ రావ్
కూకట్ పల్లి - జూపల్లి సత్యనారాయణ
పఠాన్ చెరువు - మెట్టు కుమార్
హైదర్ నగర్ - నార్నె శ్రీనివాస్
ఆల్వాల్ - చింతల విజయశాంతి రెడ్డి
వెంకటాపురం - సబితా గౌడ్
జగద్గిరిగుట్ట - జగన్
వివేకానందనగర్ - మాదవరం రోజా 
గోల్నాక - దూసరి
హఫీజ్ పేట్ - పూజిత
కొండాపూర్ - హమీద్ పటేల్ 
యూసుఫ్ గూడ - రాజ్ కుమార్ పటేల్ 
ఫతేనగర్ - పండాల సతీష్ గౌడ్
నాచారం - శాంతి సాయిజేన్‌
ఖైరతాబాద్..విజయా రెడ్డి
గాజులరామారం- రావుల శేషగిరి
సోమాజిగూడ- వనం సంగీత

 

బీజేపీ
అమీర్ పేట్ - సరళ
చిలుకా నగర్ - గోనె శైలజ
హబ్సిగూడ - చేతన
అక్బర్ బాగ్ - మినాజ్ ఉద్దీన్
హయత్ నగర్ - కళ్లెం నవజీవన్ రెడ్డి
గచ్చి బౌలి - గంగా ధర్ రెడ్డి
అడిక్ మెట్ - సునీత ప్రకాష్ గౌడ్
జీడిమెట్ల - తారా చంద్ర రెడ్డి
గుడిమల్కాపూర్ - కర్ణాకర్
హస్తినాపురం - బానోతు సుజాత
వనస్థలిపురం - వెంకటేశ్వర్ రెడ్డి
చైతన్య పురి - నర్సింహ గుప్త
మోండా మార్కెట్‌- దీపిక
బేగంబజార్-  శంకర్ యాదవ్
గోశామహల్ 51- లాల్ సింగ్
మంగల్ హాట్ - శశి కళ
జాంబాగ్ - రాకేష్ జైస్వాల్
గన్ ఫౌండ్రి- డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్ 

ఎంఐఎం
చావ్ని - ఎంఐఎం అబ్దుల్ సలాం షహీ
డబీర్ పుర - ఎంఐఎం 
ఉప్పుగూడ - ఆబ్దాద్
తలాబ్ చంచలం - సమీనా బేగం 
నవాబ్ సహేబ్ కుంట - షీరీన్ కాతూన్
మెహెదీ పట్నం- మాజిద్‌ హుస్సేన్‌
సంతోష్ నగర్ - ముజ్ఫర్ హుస్సేన్
దత్తత్రేయనగర్ - జాకీర్ బక్రి
మొగల్పుర - నస్రీన్ సుల్తానా
ఛాంద్రాయణగుట్ట - అబ్దుల్ వాహబ్ 
రియాసత్ నగర్- మిర్జా ముస్తాఫా బేగ్
ఆనంద్ నగర్ - నసీరుద్దీన్
రమాన్సపుర- అబ్దుల్‌ ఖాదీర్‌
జహనుమా-అబ్దుల్‌ ముక్తదీర్

శాస్ర్తీపురం

కాంగ్రెస్
ఏస్ రావ్ నగర్ - సింగిరెడ్డి శిరీషా రెడ్డి
ఉప్పల్ - రజిత

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top