పేద కుటుంబానికి పెద్ద కష్టం: ప్లీజ్‌..నన్ను బతికించండి..

Gastric Disease: Family Suffering Economic Problem For Operation - Sakshi

గ్యాస్ట్రిక్‌ సమస్యతో బాధపడుతున్న సంతోశ్‌ వేడుకోలు

ఆపరేషన్‌కు రూ.15 లక్షలు అవసరం

ఆపన్నహస్తాల కోసం ఎదురుచూపులు

కరీంనగర్‌ టౌన్‌: అద్దె ఇంట్లో జీవనం..వచ్చి పడ్డ ఆపదతో పేద కుటుంబం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కరీంనగర్‌ జిల్లాకేంద్రంలోని శ్రీనివాస్‌ థియేటర్‌ పక్క వీధిలో నలభై ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్న మిట్టపల్లి రాజయ్య ఓ ఏజెన్సీకి సంబంధించిన ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు ముగ్గురు సంతానం. ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు సంతోశ్‌ డిగ్రీ వరకు చదువుకున్నాడు.
చదవండి: పేరుకు ఊరి సర్పంచ్‌.. చేసేది గంజాయి సరఫరా

కొన్నాళ్లు స్టేషనరీ షాపులో పని చేయగా అనంతరం హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా నెలకు రూ.9 వేల జీతానికి పని చేస్తున్నాడు. అతడికి భార్య ముగ్గురు పిల్లలు. ఉన్నంతలో సాఫీగా సాగుతున్న సంతోశ్‌ అనారోగ్యానికి గురయ్యాడు. రెండేళ్ల కిందట కడుపులో నొప్పి రావడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. కడుపులో చిన్నపేగు దగ్గర పెద్ద కణితి తయారైందని నిర్ధారణ అయింది.
చదవండి: యువ రైతు కన్నీటి వ్యథ.. 13 ఎకరాల్లో పంట నీట మునక.. తట్టుకోలేక

రూ.15 లక్షలు అవసరం 
సంతోశ్‌ ఏడాదిన్నరగా ఇంట్లో మంచానికే పరిమితం అయ్యాడు. అతడి ఆదాయంపై ఆధారపడిన కుటుంబం ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. రెక్కాడితే గానీ డొక్కాడని తమకు శస్త్రచికిత్స కోసం రూ.15 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆ కుటుంబం బాధపడుతోంది. పేద కుటుంబానికి పెద్ద కష్టం రావడంతో వైద్య చికిత్స కోసం అవసరమైన మొత్తాన్ని సమకూర్చుకోలేకపోతున్నారు. మానవతావాదులు ఎవరైనా సహాయం చేస్తారా అని ఆ కుటుంబం దీనంగా ఎదురుచూస్తోంది.

సహాయం చేయాలనుకునే దాతలు సంప్రదించాల్సిన వివరాలు
మిట్టపల్లి సంతోశ్‌ బ్యాంక్‌ ఖాతా
హెచ్‌డీఎఫ్‌సీ 50100 3274 70439
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ : హెచ్‌డీఎఫ్‌సీ 0003461
ఫోన్‌ నంబర్‌ : 98494 72734 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top