వినాయక చవితి రోజు షాకింగ్‌ ఘటన.. సోషల్‌ మీడియాలో వైరల్‌ | Ganesh Statue Stolen In Sircilla Gopal Nagar | Sakshi
Sakshi News home page

వినాయక చవితి రోజు షాకింగ్‌ ఘటన.. సోషల్‌ మీడియాలో వైరల్‌

Sep 1 2022 11:03 AM | Updated on Sep 1 2022 11:34 AM

Ganesh Statue Stolen In Sircilla Gopal Nagar - Sakshi

సిరిసిల్ల గోపాల్‌నగర్‌లో షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. మండపం నుండి వినాయకుని ప్రతిమను దొంగలు ఎత్తుకెళ్లారు. 

సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల గోపాల్‌నగర్‌లో షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. మండపం నుండి వినాయకుని ప్రతిమను దొంగలు ఎత్తుకెళ్లారు. వీధిలోని చిన్న పిల్లలు తొలిసారి ప్రతిష్ఠించిన గణనాథుడి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. రాత్రి 12 గంటల వరకూ జనాలు, పిల్లలు అక్కడే ఉండగా, అర్థరాత్రి తర్వాత ప్రతిమ చోరీకి గురైంది. ఘటన పట్ల కాలనీ కాలనీ వాసుల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం దొంగతనం వ్యవహారం వైరల్‌గా మారింది.  మరో చోట తాళం వేసిన ఇంటి తలుపులు పగులకొట్టి చోరీకి విఫలయత్నం చేశారు. గోపాల్ నగర్‌లో చోరీ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
చదవండి: గణేష్‌ ఉత్సవాలు షురూ.. ఈ  జాగ్రత్తలు, సూచనలు మర్చిపోకండి! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement