హీరోయిన్ రాశీ ఖన్నాకు చేదు అనుభవం..! | Vanity van staffer caught stealing RS 50,000 from Raashii Khanna purse | Sakshi
Sakshi News home page

Raashii Khanna: హీరోయిన్ రాశీ ఖన్నా నగదు మాయం..!

Apr 17 2026 5:17 PM | Updated on Apr 17 2026 6:16 PM

Vanity van staffer caught stealing RS 50,000 from Raashii Khanna purse

హీరోయిన్ రాశి ఖన్నాకు చేదు అనుభవం ఎదురైంది. తాను నటిస్తోన్న ఓ మూవీ షూటింగ్‌లో ఆమె నగదు చోరీకి గురైంది. రాశీ హ్యాండ్ బ్యాగ్‌ నుంచి రూ.50 వేలను తస్కరించినట్లు తెలుస్తోంది. మూవీ సెట్స్‌లోని వానిటీ వ్యాన్‌లో పనిచేసే ఓ ఉద్యోగి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. అతన్ని వెంటనే గుర్తించిన భద్రతా సిబ్బంది అతడిని చితకబాది.. బయటికి గెంటేశారు.

ఈ చోరీతో మూవీ సెట్స్‌లోని సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. మూవీ షూటింగ్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన చూసి చాలా దిగ్భ్రాంతికి గురైనట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇలాంటి  సంఘటనలు జరగడం పరిశ్రమకు సిగ్గుచేటన్నారు. కానీ ఎలాంటి చోరీ జరగలేదని రాశీ ఖన్నా టీమ్‌ చెప్పడం విశేషం. ఈ విషయంపై మాట్లాడటానికి రాశీ ఖన్నా మేనేజర్ నిరాకరించారు. కాగా.. రాశీ ఖన్నా ప్రస్తుతం అనీస్ బాజ్మీ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, విద్యా బాలన్‌లతో కనిపించనుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement