'అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు.. బలవంతంగా చేస్తున్నారు' | Strange Incident In Sircilla District | Sakshi
Sakshi News home page

'అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు.. బలవంతంగా చేస్తున్నారు'

Jul 9 2026 7:57 AM | Updated on Jul 9 2026 8:59 AM

Strange Incident In Sircilla District

తంగళ్లపల్లి(సిరిసిల్ల): ‘అమ్మాయికి పెళ్లి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒప్పించి చేస్తున్నారు..’అంటూ రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి పోస్టర్లు వెలిశాయి. సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ యువతి, అదే జిల్లాకు చెందిన ఓ యువకుడు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు ఈ పోస్టర్ల ద్వారా తెలిపారు. 

ఆ యువతికి పెళ్లి ఇష్టం లేకపోయినా ఆమె తల్లిదండ్రులు తంగళ్లపల్లికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయించారని, తమ ప్రేమ విషయం ఆ పెళ్లి కొడుకుకు తెలిసినా 16 తులాల బంగారం కోసం అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని ప్రేమికుడు ఆరోపించాడు. ఈ పోస్టర్ల అంశం జిల్లాలో చర్చనీయాంశమైంది. కాగా అమ్మాయి తరఫు వారు ఆ యువకుడిపై సిద్దిపేటలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement