రెల్వే ఉద్యోగాలకు ఉచిత శిక్షణ | Free Coaching for Railway jobs in Hyderabad | Sakshi
Sakshi News home page

Free Coaching: రెల్వే ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

Apr 16 2025 5:53 PM | Updated on Apr 16 2025 6:15 PM

Free Coaching for Railway jobs in Hyderabad

హైద‌రాబాద్‌: రైల్వేలో ఉద్యోగాలు సాధించడానికి కావాల్సిన శిక్షణను పరవస్తూ క్రియేటివ్‌ ఫౌండేషన్, రాంకీ ఫౌండేషన్, లయన్స్‌ క్లబ్‌ గ్రీన్‌లాండ్స్‌ సంస్థల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ (Free Coaching) అందించనున్నారు. రైల్వేలో ఉద్యోగం పొందడానికి 3 నుంచి 4 నెలలపాటు అన్ని విధాలా శిక్షణను నిరుద్యోగ యువతకు ఇవ్వనున్నట్లు సంస్థల ప్రతినిధులు గద్దె భాస్కర్, మువ్వ రాంరెడ్డి, ఫ్రొఫెసర్‌ లక్ష్మీకుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగ యువతకు ఈ నెల 20వ తేదీన అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు ఉచిత భోజనం, వసతి, కోచింగ్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. శ్రీధర్‌ సీసీఈ ఇనిస్టిట్యూట్‌ సహకారంతో ఉత్తమ శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రల్లోని (Telugu States) వివిధ నగరాల్లో అర్హత రాత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హత పరీక్షకు హాజరు కావాల్సిన వారు ముందుగా తమ పేర్లను ఈ నెల 17వ తేది లోపు నమోదు చేసుకోవాలని, ఆసక్తి గల వారు పరవస్తు క్రియేటివ్‌ ఫౌండేషన్‌ ఫేస్‌బుక్‌ పేజీ, యూట్యూబ్‌ చానల్‌ను, ఫోన్‌: 9515658033లలో సంప్రదించవచ్చని సూచించారు.

18న రైల్‌ మ్యూజియం ఉచిత సందర్శన 
హైద‌రాబాద్‌: వరల్డ్‌ హేరిటేజ్‌ డే (World Heritage Day) సందర్భంగా ఈ నెల 18వ తేదీన కాచిగూడ రైల్వే స్టేషన్‌లోని రైల్‌ మ్యూజియంను ఉచితంగా సందర్శించవచ్చని స్టేషన్‌ డైరెక్టర్‌ కె.బాలాజీ తెలిపారు. స్కూల్, కాలేజీ విద్యార్థులు, రైల్‌ ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  

మియాపూర్‌ రన్నర్స్‌ టీ షర్ట్‌ ఆవిష్కరణ 
కేపీహెచ్‌బీ కాలనీ: ఇగ్నైట్‌ విద్యాసంస్థల సైన్స్‌ ల్యాబ్‌ ప్రాంగణంలో మంగళవారం బాలానగర్‌ డీసీపీ సురేష్‌ కుమార్‌ చేతుల మీదుగా మియాపూర్‌ రన్నర్స్‌ (Miyapur Runners) టీ షర్ట్, మెడల్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరికీ శారీరక దారుఢ్యంతో కూడిన మానసిక వికాసం ఎంతో అవసరమని అన్నారు. 

ఈ నేపథ్యంలో ఇగ్నైట్, అవంతిక యాజమాన్యాలు ఈ నెల 20న చేపట్టనున్న మియాపూర్‌ రన్‌ను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో కేపీహెచ్‌బీ (KPHB) ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి, ఇగ్నైట్‌ చైర్మన్‌ రమేష్, అవంతిక కన్‌స్ట్రక్షన్స్‌ శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రన్నర్స్‌ తరఫున జగన్మోహన్‌రెడ్డి, నరేష్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

చ‌ద‌వండి: జస్ట్‌ 9999 నెంబర్‌ కోసం ఏకంగా రూ. 12 లక్షలు పైనే..!

Advertisement
 
Advertisement
Advertisement