రెండ్రోజుల్లో సజ్జనార్‌ను విచారించనున్న ఎన్‌హెచ్‌ఆర్సీ 

Former CP Sajjanar To Appear Before Probe Panel in 2 Days - Sakshi

నేటితో ముగియనున్న మానవ హక్కుల సంఘం బృందం విచారణ!

ఇప్పటికే సజ్జనార్‌కు సమన్లు జారీ చేసిన సిర్పుర్కర్‌ కమిషన్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యులతో కూడిన జస్టిస్‌ వీఎస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ విచారణ కొనసాగుతోంది. దిశ ఎన్‌కౌంటర్‌ సమయంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా పనిచేసిన వీసీ సజ్జనార్‌ను గురువారం లేదా శుక్రవారం విచారణ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సజ్జనార్‌కు త్రిసభ్య కమిటీ భౌతికంగా సమన్లు జారీ చేసింది. సోమవారం ప్రారంభమైన జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) ముగ్గురు సభ్యుల విచారణ మంగళవారం కూడా కొనసాగింది.

మరొక సభ్యుడి విచారణతో బుధవారం ముగిసే అవకాశం ఉంది. ఆ తర్వాత దిశ హత్యాచార నిందితులైన నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం జక్లేర్‌కు చెందిన అరీఫ్, గుడిగండ్ల గ్రామానికి చెందిన చెన్నకేశవులు, జొల్లు నవీన్‌ కుమార్, జొల్లు శివలను ప్రైవేట్‌ అతిథి గృహంలో ఉంచి పోలీసులు విచారించిన నేపథ్యంలో ఆ అతిథిగృహం వాచ్‌మెన్‌ను కూడా సిర్పుర్కర్‌ కమిషన్‌ విచారించనుంది. ఆ తర్వాత ఫోరెన్సిక్‌ బాలిస్టిక్‌ రిపోర్ట్, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ నిపుణులను కూడా విచారణ చేయనుందని తెలిసింది.
చదవండి: స‌జ్జ‌నార్ కీల‌క నిర్ణ‌యం.. ఇక బస్సులపై ఈ పోస్టర్లు కనిపించవు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top