ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ కీల‌క నిర్ణ‌యం.. ఇక బస్సులపై ఈ పోస్టర్లు కనిపించవు

TSRTC MD Sajjanar Reaction On Netizen Tweet About On Posters RTC Buses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ బస్సులపై అశ్లీల పోస్టర్లను నిషేధిస్తూ టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అభ్యంతరకరమైన, ఆశ్లీల చిత్రాలు హైదరాబాద్‌ నగర బస్సులపై కనిపించవని ఆయన స్పష్టం చేశారు. ఓ సినిమాకు సంబంధించిన అశ్లీల పోస్టర్‌ ఆర్టీసీ బస్సుపై ఉండటాన్ని  అభిరామ్‌ నేత అనే నెటిజన్‌  బుధవారం  ట్విటర్‌లో పోస్టు చేశాడు. దీనికి టీఎస్‌ఆర్టీసీ ఎండీ ఆఫీస్‌ను ట్యాగ్‌ చేశాడు. ఈ  ట్వీట్ వైరల్ కావడంతో సజ్జనార్‌ స్పందించారు.

సంస్థ దీనిపై చర్యలు తీసుకుంటుందని.. భవిష్యత్తులో ఆర్టీసీ బస్సులపై అశ్లీల పోస్టర్లు కనిపించకుండా చర్యలు తీసుకుంటామని ఆయన రీట్వీట్ చేశారు. చెప్పినట్లుగానే ఆర్టీసీ బ‌స్సుల‌పై అసౌక‌ర్యంగా, అభ్యంత‌ర‌క‌రంగా ఉండే పోస్ట‌ర్ల‌ను వెంట‌నే తొల‌గించాల‌ని సంబంధిత అధికారుల‌కు స‌జ్జ‌నార్ ఆదేశాలు జారీ చేశారు. సజ్జనార్‌  చర్యపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top