కరెంటు కోతల్లేవ్‌ నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం | Formation of 226 Special View of Call Teams in GHMC: Bhatti Vikramarka | Sakshi
Sakshi News home page

కరెంటు కోతల్లేవ్‌ నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం

Published Sat, May 4 2024 5:27 AM | Last Updated on Sat, May 4 2024 5:27 AM

Formation of 226 Special View of Call Teams in GHMC: Bhatti Vikramarka

గతేడాది కంటే ఎక్కువ ఇస్తున్నాం 

ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే బీఆర్‌ఎస్‌ కరెంట్‌ కట్‌ నాటకం

కాంగ్రెస్‌ వస్తే కరెంటు పోతుందన్న దుష్ప్రచారంపై బీఆర్‌ఎస్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో  ప్రజలే బుద్ధి చెప్పారు

ఈ ఏడాది విద్యుత్‌ డిమాండ్‌ బాగా పెరిగింది

జీహెచ్‌ఎంసీలో 226 స్పెషల్‌ వ్యూ ఆఫ్‌ కాల్‌ టీమ్‌ల ఏర్పాటు

విద్యుత్‌ శాఖ మంత్రి భట్టి విక్రమార్క

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరెంట్‌ కోతలు లేనే లేవని, పీక్‌ డిమాండ్‌లోనూ  నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్‌శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే బీఆర్‌ఎస్‌ నాయకులు కరెంట్‌ కట్‌ నాటకానికి తెర తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ వస్తే కరెంటు పోతుందని అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ నేతలు చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పి కొట్టి ఎన్నికల్లో గుణపాఠం చెప్పినా.. వారికి ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు.

 సూర్యాపేటలో, మహబూబ్‌ నగర్‌లో కేసీఆర్‌ ఉన్నప్పుడే కరెంటు పోయిందని సోషల్‌ మీడియాలో లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన ప్పటి నుంచి నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నా మనీ, ఎక్కడ కరెంట్‌ కోతలు లేవని పునరుద్ఘాటించారు. ఎక్కడైనా సాంకేతిక కారణాలతో అంతరాయం తలెత్తినా.. వెంటనే విద్యుత్‌ సిబ్బంది అక్కడ విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిస్తున్నారని తెలిపారు.

 విద్యుత్‌ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజలకు అసౌకర్యం కలి గిస్తే వాటిని కూడా ఉపేక్షించటం లేదనీ. వెంటనే వారిపై శాఖాపరమైన చర్యలు తీసు కుంటున్నట్లు వివరించారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటే కూడా బీఆర్‌ఎస్‌ నాయ కులు రాజకీయం చేస్తూ తప్పు పట్టడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ మేరకు భట్టి విక్రమార్క శుక్రవారం హైదరాబాద్‌లో సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు.
 

గతేడాదితో పోలిస్తే విద్యుత్‌ వినియోగం పెరిగింది 
2022 డిసెంబర్‌ నుంచి 2023 ఏప్రిల్‌ వరకు మొత్తం 36, 207 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ సరఫరా చేయగా,  కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్‌ నుంచి 2024 ఏప్రిల్‌ 30 వరకు 38,155 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు సరఫరా చేశా మని భట్టి తెలిపారు. ఒకే రోజున గరి ష్టంగా 15,497 మెగావాట్ల పీక్‌ డిమాండ్‌  విద్యుత్‌ సర ఫరా చేసిన చరి త్ర కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని వెల్లడించారు. ఈ వే సవిలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరడంతో  విద్యుత్‌ డిమాండ్‌ సహజంగానే పెరిగిందని వివరించా రు. 

అక్కడక్కడా లోడ్‌ పెరిగితే ఒక్కోసారి ట్రిప్‌ అవటం, దీంతో విద్యుత్‌ సరఫరాలో  సాంకేతిక అవాంతరాలు తలెత్తుతున్నా..  వాటిని ఎప్పటికప్పు డు విద్యుత్‌ సిబ్బంది అధిగమిస్తూ ప్రజలకు అసౌకర్యం లేకుండా సత్వర సేవలు అందిస్తున్నారని తెలిపారు.

అంతరాయాలను తగ్గించాం.. ఇదిగో ఆధారం
‘గత ఏడాది ఏప్రిల్‌ 24 నుంచి ఏప్రిల్‌ 30 వరకు వారం రోజులు మండు టెండలున్నాయి. అప్పుడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు గ్రేటర్‌ హైదరాబా ద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో 1,369 సార్లు 11 కేవీ లైన్‌ ట్రిప్‌ అయ్యాయి. మొత్తం ఆ వారం రోజుల్లో 580 గంటలు విద్యుత్‌కు అంతరాయం వాటిల్లింది. ఇప్పుడు అదే గడిచిన వారంలో కేవలం 272 చోట్ల 11 కేవీ విద్యుత్‌ సరఫరా ట్రిప్‌ అయింది. కేవలం 89 గంటలు మాత్రమే అంతరాయం వాటిల్లింది‘ అని భట్టి విక్రమార్క వివరించారు.

‘గత ఏడాది అదే వారంలో లెక్కలు చూసుకుంటే అప్పుడు 301 ట్రాన్స్‌ ఫార్మర్లు ఫెయిలయ్యా యి. ఇప్పుడు కేవలం 193 ట్రాన్స్‌ ఫార్మర్లు మాత్రమే ఫెయిలయ్యాయి. వాటిని కూడా వెంటనే మార్చి కొత్తవి బిగించి విద్యుత్‌ పునరుద్ధరించాం. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వం మెరుగైన విద్యుత్‌ సరఫరా చేస్తుందనడానికి ఇంతకంటే ఏం ఆధారం కావాలి.? అని ప్రశ్నించారు. అప్పట్లో  కరెంట్‌ కోత లేనేలేదని మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ నాయకులు వీటికేం సమాధానం చెబుతారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిలదీశారు.

నగరంలో 226 స్పెషల్‌ టీంలు
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కడైనా విద్యుత్‌ అంతరాయానికి సంబంధించిన ఫిర్యాదు వచ్చినా వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేకంగా 226 స్పెషల్‌ వ్యూ ఆఫ్‌ కాల్‌ టీమ్‌ లను ఏర్పాటు చేశామని భట్టి వెల్లడించారు. హైదరాబాద్‌లో ఇంటిగ్రేటేడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి విద్యుత్‌ సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ఎక్కడ ఇబ్బందొచ్చినా వెంటనే పరిష్కరించేందుకు ఈ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్విరామంగా పని చేస్తోందని భట్టి విక్రమార్క వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement