పెట్రోల్‌ బంక్‌లో బైక్‌కు మంటలు

Fires broke out at Bharat Petrol Bunk in Chikkadpally - Sakshi

హైదరాబాద్: ‌చిక్కడపల్లిలోని భారత్‌ పెట్రోల్‌ బంక్‌లో భారీ ప్రమాదం తప్పింది. స్కూటీలో పెట్రోల్ పోస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వాహన యజమాని భయంతో బంక్ బయటకి పరిగెత్తాడు. అక్కడ ఉన్న బంక్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అగ్నిమాపక సిలిండర్‌తో స్ప్రే చేసినా మంటలు అదుపులోకి రాకపోవడంతో‌ బంక్‌ సిబ్బంది అత్యవసరం కోసం నిల్వచేసిన ఇసుక బకెట్లను తెచ్చి బండిపై పోసి మంటలను ఆర్పివేశారు. అక్కడ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో సిబ్బంది, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారణాలను అన్వేషిస్తున్నారు.

చదవండి:

అంబర్‌పేట్‌లో విష వాయువుల కలకలం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top