సాక్షి,మహబూబ్‌నగర్: గొల్లపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ జిన్నింగ్ మిల్లులో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించగా.. పలువురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. జిన్నింగ్ మిల్లు యాజమాన్యం ఫిర్యాదుతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. గాయపడిన బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.




