కోఠిలో భారీ అగ్నిప్రమాదం | Fire Accident In Koti Hyderabad | Sakshi
Sakshi News home page

కోఠిలో భారీ అగ్నిప్రమాదం

Feb 7 2021 6:20 AM | Updated on Feb 7 2021 11:49 PM

Fire Accident In Koti Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోఠిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌ సర్క్కూట్‌ కారణంగా శనివారం రాత్రి ఆంధ్రాబ్యాంక్‌కు ఎదురుగా ఉ‍న్న ఓ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఒక దుకాణంలో మొదలైన మంటలు పక్కనే ఉన్న మరో నాలుగు షాపులకు వ్యాపించాయి. ప్రమాద సమాచారం అందుకున్న సుల్తాన్‌ బజార్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్‌ పోలీసులు వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పుతున్నారు. నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement