హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలనే లక్ష్యంతొ కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ, రాష్ట్రంలో ఏదో మూల డ్రగ్స్ మూలాలు మాత్రం కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఈగల్ టీమ్ చేసిన దాడుల్లో ఆరుగురి విద్యార్థులకు డ్రగ్స్ పాజిటీవ్ వచ్చింది.
బేగంపేటలోని ఒ హోటల్ మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లో ఈగల్ టీమ్ దాడులు నిర్వహించింది. అక్కడకు డ్రగ్స్ సప్లై అయినట్లు సమాచారం అందుకున్న ఈగల్ టీమ్.. ఆ మేరకు తనిఖీలు చేసింది. ఇందులో 11 మంది విద్యార్థుల్ని అదుపులోకి తీసుకుంది. వీరిని పరీక్షించగా ఆరుగురు విద్యార్థులు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. పుట్టినరోజు వేడుక పేరుతో జరిగిన ఈవెంట్‌లో వారు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.


