సీఎం చేతుల మీదుగా చెక్కులిస్తామని పిలిచి.. | Farmers are disappointed as CM Revanth | Sakshi
Sakshi News home page

సీఎం చేతుల మీదుగా చెక్కులిస్తామని పిలిచి..

Aug 16 2024 4:43 AM | Updated on Aug 16 2024 4:43 AM

Farmers are disappointed as CM Revanth

వైరా: సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రూ.2 లక్షల రుణమాఫీ చెక్కులు అందుకుందామని వచ్చిన పలువురు రైతులకు నిరాశ ఎదురైంది. సీఎం రేవంత్‌ వైరా సభలో రుణమాఫీని ప్రకటించి రైతులకు చెక్కులు ఇస్తారని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు.

ఇందుకోసం కారేపల్లి మండలం చీమలపాడుకు చెందిన అజ్మీరా రాజేశ్వరి, వైరా మండలం స్నానాల లక్ష్మీపురానికి చెందిన అడుసుమిల్లి పురుషోత్తం, వైరాకు చెందిన దార్ల పూజ, ధీరావత్‌ బిచ్చా, రఘునాథపాలెం మండలం పరికలబోడు తండాకు చెందిన తేజావత్‌ వీరు, ఏన్కూరు మండలం జన్నారానికి చెందిన పి.నర్సయ్య, కల్లూరు మండలం బాలాజీనగర్‌కు చెందిన పిళ్లా నాగేశ్వరరావు, మధిర మండలం సిద్దినేనిగూడెంకు చెందిన కె.వీరస్వామి తదితరులను రెండు గంటల ముందుగానే సభా ప్రాంగణానికి తీసుకొచ్చారు. 

సీఎం ప్రసంగం ముగియగానే జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల ఆ రైతులను వేదికపైకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ సీఎం రేవంత్‌ పట్టించుకోకుండా మంత్రులతో కలిసి వెళ్లిపోవడంతో రైతులు నిరాశగా వెనుదిరిగారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement