ఈటల రాజేందర్‌కు తప్పిన ప్రమాదం

ఢిల్లీ: ఈటల రాజేందర్ బృందానికి ప్రమాదం తప్పింది. ఈటల బృందం ఢిల్లీ నుంచి వస్తున్న విమానంలో సాంకేతిక సమస్య చోటు చేసుకుంది. దీంతో పైలట్ అలెర్ట్ అవ్వటంతో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్యను పైలట్ గుర్తించాడు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఈటల బృందం బయల్దేరింది. సోమవారం ఢిల్లీలో ఈటల లాంఛనంగా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈటల బృందం నేడు తిరిగి రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. ఈ సమయంలో ఈ ఘటన జరిగింది.
ఇటీవల టీఆర్‌ఎస్‌కి గుడ్ బై చెప్పిన ఈటలకు సోమవారం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ బీజేపీ సభ్యత్వం ఇచ్చారు. ఈటలతో పాటు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి , మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, తెలంగాణ ఆర్టీసీ నేత అశ్వద్ధామ రెడ్డి బీజేపీలో చేరారు.
చదవండి: ఆస్తులపై చర్చకు సిద్ధమా? : సీఎం కేసీఆర్‌కు ఈటల సవాల్
మరిన్ని వార్తలు