15 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం | Employee health scheme from 15th july | Sakshi
Sakshi News home page

15 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం

Jun 28 2026 1:19 AM | Updated on Jun 28 2026 1:19 AM

Employee health scheme from 15th july

వారం రోజుల్లో సమగ్ర నిబంధనలు విడుదల 

భార్య, భర్త ఉద్యోగులైతే ఒకరినుంచే చందా వసూలు 

ఈహెచ్‌సీటీ తొలి సమావేశంలో నిర్ణయాలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య పథకం వచ్చేనెల 15 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఎంప్లాయీస్‌ హెల్త్‌కేర్‌ ట్రస్టు (ఈహెచ్‌సీటీ) నిర్ణయించింది. శనివారం సచివాలయంలో ఈహెచ్‌సీటీ తొలి సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆరోగ్య పథకం అమలు, నిబంధనలు, విధివిధానాలపై చర్చ జరిగింది. ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఈహెచ్‌ఎస్‌) అమలు, నిబంధనలు, చందా వసూలు, తదితర అంశాలపై ట్రస్టు సభ్యులు సుదీ ర్ఘంగా చర్చించారు. నిబంధనలను వారం రోజుల్లో ఖరారు చేయాలని ట్రస్టు సభ్యు లు నిర్ణయించారు. 

అదేవిధంగా ఉద్యోగుల ఆరోగ్య పథకంలో ఉద్యోగి వాటా విషయంలో కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరదించారు. భార్య, భర్త ఇద్దరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైతే కేవ లం ఒకరి నుంచి మాత్రమే చందా వసూ లు చేయాలని, మరొకరికి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల్లో హాస్పిటల్‌ యాజమాన్య ప్రతినిధులతో వైద్య,ఆరోగ్య శాఖ, ట్రస్టు సభ్యుల సమావేశం నిర్వహించనున్నారు. 

ఈమేరకు సంబంధిత అధికారులు చర్య లు తీసుకోవాలని సీఎస్‌ ఆదేశించారు. పథకం అమలుకు సంబంధించిన పలు అంశాలను కూడా సమావేశంలో ప్రస్తావించారు. తదుపరి సమావేశంలో ప్యాకేజీ రేట్లు, ఆస్పత్రుల జాబితాలను ఖరారు చేయనున్నారు. ఈ సమావేశంలో ట్రస్టు సభ్యులు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు, వి.లచి్చరెడ్డి,  సైదులు, చావ రవి, జి.సదానందం  పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement